Swathimuthyam Trailer: ట్రైలర్ ఇలా ఉందేంటి బాబోయ్!

ABN , First Publish Date - 2022-09-26T22:23:02+05:30 IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తమ్ముడు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా అరంగేట్రం చేస్తున్న..

Swathimuthyam Trailer: ట్రైలర్ ఇలా ఉందేంటి బాబోయ్!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తమ్ముడు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’ (Swathimuthyam). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi).. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాని దసరా స్పెషల్‌గా అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్  సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ.. ‘అయ్యబాబోయ్ ట్రైలర్ ఏంటి.. ఇలా ఉంది?’ అని అనకుండా ఉండలేరు. 


‘నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు’ అంటూ వర్ష బొల్లమ్మ పలికే సంభాషణలతో ఆహ్లాదకరంగా మొదలైన ఈ ట్రైలర్‌.. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్‌ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో నడిచింది. అయితే కాసేపట్లో పెళ్లి అనగా.. వారికి ఊహించని సమస్య వస్తుంది. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి? దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి వాటికి సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. అనేలా ట్రైలర్‌ని కట్ చేశారు. ఓవరాల్‌గా సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. సన్నివేశాలకు తగ్గట్లు హృదయాన్ని హత్తుకునేలా ఉన్న నేపథ్య సంగీతంతో పాటు.. ‘మీరు నాకు చూడగానే నచ్చేశారండీ.. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరినీ చూడకూడదని ఫిక్స్ అయ్యేంతలా’ అని గణేష్ చెప్పే డైలాగ్.. ‘ఓవరాల్‌గా క్యారెక్టర్‌లో మావాడు స్వాతిముత్యం’ అని వర్ష చెప్పే డైలాగ్‌‌తో ఇందులో మంచి ప్రేమకథ ఉందని తెలియజేశారు. కానీ ఫ్యామిలీ మధ్య  ‘నా ఇంట్లో నాకేం తెలియట్లేదు బాబోయ్’, ‘ఏమే ఆ స్వీట్లు, జాంగ్రీలు లోపల పెట్టించు’ వంటి సంభాషణలు.. ఆ సంభాషణల టైమ్‌లో వచ్చే సన్నివేశాలు.. ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌‌గా ఉండబోతోందనేది కూడా తెలియజేశారు. అందుకేనేమో.. అదే రోజు పెద్ద సినిమాలు రెండు విడుదలవుతున్నా కూడా.. ధైర్యంగా ఈ చిత్రాన్ని వదులుతున్నారు. మొత్తంగా అయితే.. పండగకి పర్ఫెక్ట్ సినిమాలానే ఈ సినిమా ఉండబోతుందనేది ఈ ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. కాసేపట్లో పెళ్లి జరగబోతున్న హీరోకి వచ్చిన ప్రాబ్లమ్ ఏమై ఉంటుందనేదే.. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. అదేంటో తెలియాలంటే మాత్రం.. అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయక తప్పదు. (Swathimuthyam Trailer Talk)



Updated Date - 2022-09-26T22:23:02+05:30 IST