Cannes Film Festival లో పాల్గొనడానికీ ముందు లగేజీని పొగొట్టుకున్న Pooja Hegde

ABN , First Publish Date - 2022-05-21T21:01:01+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఇండస్ట్రీకీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో భారత్ తరఫున పాల్గొంటున్న సంగతి

Cannes Film Festival లో పాల్గొనడానికీ ముందు లగేజీని పొగొట్టుకున్న Pooja Hegde

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఇండస్ట్రీకీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో భారత్ తరఫున పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ‘టాప్ గన్: మావెరిక్’ ప్రీమియర్ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ఆమె సందడి చేసింది. ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ లో పాల్గొనడానికీ ముందు ఆమె లగేజీని పొగొట్టుకుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ‌లో చెప్పుకొచ్చింది.


దుస్తులతో సహా మేకప్ కిట్, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను పొగొట్టుకున్నానని పూజా హెగ్డే తెలిపింది. ‘‘భారత్ నుంచి బయలుదేరినప్పుడు ఒక్క ట్రావెల్ బ్యాగ్‌ను మాత్రమే చెక్ చేశారు. మిగిలిన బ్యాగులు ఇక్కడే ఉండిపోయాయి. ఆ ట్రావెల్ బ్యాగ్ కూడా ప్రయాణిస్తున్నప్పుడు తప్పిపోయింది. దుస్తులు, మేకప్ కిట్, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను మేం పొగొట్టుకున్నాం. కానీ, ఇండియా నుంచి కొన్ని నగలను హ్యాండ్ బ్యాగులో నేను పట్టుకుని వచ్చాను. విమానం ల్యాండ్ అయిన తర్వాతే మా వస్తువులు పోయాయనే విషయం మాకు తెలిసింది. అప్పుడు నా కంటే ఎక్కువగా నా మెనేజర్ ఆందోళనకు గురయ్యారు. భయపడకు అని నేను సర్ది చెప్పాను. మా టీం ఉరుకులు, పరుగుల మీద కొత్త మేకప్ కిట్, కొత్త హెయిర్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసింది. మేం ఉదయం నుంచి ఏం తినలేదు. ఆ రోజు మొదటి సారిగా వేడుకలో పాల్గొన్న తర్వాతే భోజనం చేశాం. నా హెయిర్ స్లైలిస్ట్‌కీ ఫుడ్ పాయిజన్ అయింది. నా టీమ్ వల్లే నేను ఈవెంట్‌లో పాల్గొనగలిగాను’’ అని పూజా హెగ్డే చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పూజా హెగ్డే ‘సర్కస్’ (Cirkus) సినిమాలో నటిస్తుంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు. ఆమె సల్మాన్ నిర్మిస్తున్న ‘కబీ ఈద్, కబీ దివాళీ’ (Kabhi Eid Kabhi Diwali) చిత్రంలోను కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో వెంకటేష్ చెల్లెలిగా  కనిపించబోతున్నట్టు సమాచారం.

Updated Date - 2022-05-21T21:01:01+05:30 IST