Beast సినిమాలో ఉగ్రవాదిగా కనిపించిన ఓ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఆ సీన్‌లో Vijay యాక్టింగ్‌పై విమర్శలు

ABN , First Publish Date - 2022-06-17T16:58:55+05:30 IST

తమిళంతోపాటు తెలుగులోనూ పాపులారిటీ ఉన్న కోలీవుడ్ స్టార్స్‌లో విజయ్ ఒకరు. తమిళనాడులో అయితే ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

Beast సినిమాలో ఉగ్రవాదిగా కనిపించిన ఓ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఆ సీన్‌లో Vijay యాక్టింగ్‌పై విమర్శలు

తమిళంతోపాటు తెలుగులోనూ పాపులారిటీ ఉన్న కోలీవుడ్ స్టార్స్‌లో విజయ్ (Vijay) ఒకరు. తమిళనాడులో అయితే ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన్ని అక్కడ దళపతి విజయ్ అని పిలుచుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దీలిప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘బీస్ట్’. ఏప్రిల్ 14న తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఈ మూవీ సోషల్ మీడియాలో భారీగా విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి. తాజాగా ఈ మూవీలో నటించిన ఓ యాక్టర్ విజయ్ నటనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.


సహజ నటనతో మలయాళంలో గుర్తింపుపొందిన నటుల్లో షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఒకరు. పలు సినిమాల్లో చేసిన యాక్టింగ్‌కి ప్రశంసలు సైతం పొందాడు. ఆయన తాజాగా విజయ్ బీస్ట్ చిత్రంలో నటించాడు. అందులో హీరో క్యారెక్టర్‌కి సహాయం చేసే టెర్రరిస్ట్ పాత్రను పోషించాడు. ఈ సినిమా గురించి చాకో మాట్లాడుతూ.. ‘ఓ సన్నివేశంలో విజయ్ నన్ను ఎత్తుకొని తన దాక్కునే ప్లేస్‌కి తీసుకెళతాడు. బరువుని ఎత్తినప్పుడు ఎవరీ ముఖంలో అయిన కొంచెమైన కష్టంగా ఉన్న ఫీలింగ్‌ని చూస్తాం. కానీ.. ఆ సీన్‌‌లో విజయ్ అలాంటి ఎక్స్‌ప్రెషన్ ఏది ఆయన ముఖంలో చూపించలేదు. అయితే.. అందులో విజయ్ సర్ అనడానికి ఏం లేదు. సినిమా టీం దానికి కారణం. నిజానికి నేను పూర్తి సినిమాని చూడలేదు. అయితే.. మూవీపై వచ్చిన మీమ్స్ చూశాను. అలాగే.. టెర్రరిస్టులను సినిమాలో ఇంకా బాగా చూపించి ఉండొచ్చని నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చాడు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షైన్ టామ్ చాకో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో పలువురు చాకోని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఓ అభిమాని అయితే.. ‘సినిమా విడుదలకు ముందు అదే నటుడు విజయ్ గురించి, బీస్ట్ గురించి గొప్పగా మాట్లాడాడు. అతనికి ముందే ఇవన్నీ తెలియదా?. కథ విని సినిమాను అంగీకరించడం,  విడుదల తర్వాత బ్యాడ్ రివ్యూలు వస్తే విమర్శించడం. ఇది చాలా అవమానకరం. తన సొంత సినిమా టీమ్‌ గురించి మీడియాలో ఇలా మాట్లాడినందుకు అతను సిగ్గుపడాలి’ అని ఘాటుగా తమిళంలో ట్వీట్ చేశాడు.





Updated Date - 2022-06-17T16:58:55+05:30 IST