Chiranjeevi: ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు.. బండ్ల గణేశ్‌ ట్వీట్లు వైరల్‌

ABN , First Publish Date - 2022-08-08T20:05:59+05:30 IST

నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు మెగా ఫ్యామిలీ అంటూ ప్రత్యేకమైన అభిమానం అన్న విషయం తెలిసిందే! సమయం దొరికిన ప్రతిసారీ మెగా ఫ్యామిలీపై తన అభిమానాన్ని మాటలు, చేతల రూపంలో చాటుతుంటారు. తాజాగా చిరంజీవిని ఉద్దేశించి బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Chiranjeevi: ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు..  బండ్ల గణేశ్‌ ట్వీట్లు వైరల్‌

నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌(bandla ganesh)కు మెగా ఫ్యామిలీ అంటూ ప్రత్యేకమైన అభిమానం అన్న విషయం తెలిసిందే! సమయం దొరికిన ప్రతిసారీ మెగా ఫ్యామిలీపై తన అభిమానాన్ని మాటలు, చేతల రూపంలో చాటుతుంటారు. తాజాగా చిరంజీవిని(Chiranjeevi) ఉద్దేశించి బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. చిరంజీవి తాజాగా చేసిన ఫొటో షూట్‌ నుంచి ఓ స్టైలిష్‌ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోను బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేసి చిరును ఉద్దేశించి రాసుకొచ్చారు. (Bandla ganesh twee viral)

‘‘ఈ స్టైల్‌ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం..

ఈ స్టైల్‌ చూసే మేం సినిమా రంగం వైపు పరుగులు తీశాం..

ఈ స్టైల్‌  చూసే మా జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది.. 

ఇక్కడ ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకం కల్పించుకున్నాం.

ఈ స్టైల్‌ చూసే ఇక్కడ ఎవరైనా.. ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చాం..

ఈ స్టైల్‌  చూసే అందరం మీకు అభిమానులుగా మారిపోయాం. 

మీరు ఎప్పటికి ఈ స్టైల్‌లోనే ఉండాలని మా కోరిక

ఎందరికో భరోసా.. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్‌ అంటే మాకు ఇష్టం’’ 

అని బండ్ల గణేష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న చిరంజీవి ఫొటోను చూసి బండ్ల గణేష్‌ ఫిదా అయిపోయారు. చిరు ఫొటోతోపాటు, బండ్ల ట్వీట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళాశంకర్‌’, మెగా 154 చిత్రాలతో బిజీగా ఉన్నారు. 






Updated Date - 2022-08-08T20:05:59+05:30 IST