బండ్ల గణేశ్(Bandla ganesh).. పవన్‌కల్యాణ్(Pawan kalyan)కు భక్తుడు అన్న విషయం తెలిసిందే! పవన్‌కు సంబంధించిన ఏ వేదిక మీదైనా బండ్ల తనదైన శైలి మాటలతో ఊగిపోతుంటారు. అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంటారు. అప్పుడప్పుడూ ట్విట్టర్ వేదికగా మాటల తూటాలను వదులుతుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే చిత్రాలతో పవన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా కోరారు. గబ్బర్‌సింగ్ లోకేషన్‌లో దిగిన ఫొటోను షేర్ చేసి ‘‘నా దైవ సమానులైన పవన్‌కల్యాణ్.. తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ.. మీ ప్రేమను పొందుతూ సినిమా తీేస్త బాక్స్ బద్దలే’’ అని ఆయన ట్వీట్ చేశారు. బండ్ల ట్వీట్‌కు అభిమానులు మురిసిపోతున్నారు. బండ్ల (Bandla ganesh request )ట్వీట్‌కు పవన్ ఫ్యాన్స్ (Pawan kalyan fans) స్పందించారు. ‘పవన్‌తో మళ్లీ సినిమా చేస్తున్నారా?’’ అని ప్రశ్నిస్తున్నారు.
అలాగే శుక్రవారం విడుదలై విజయం సాధించిన ‘బింబిసారా’, ‘సీతారామం’ చిత్రాలకు అభినందనలు తెలిపారు. ‘మంచి చిత్రాలు తీశారు. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’’ అని బండ్ల మరో ట్వీట్ చేశారు.