‘మాయ గంగ’ను విడుదల చేసిన సుకుమార్‌

ABN , First Publish Date - 2022-06-30T05:55:09+05:30 IST

జైద్‌ ఖాన్‌, సోనాల్‌ మోన్‌టైరో హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘బనారస్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది.

‘మాయ గంగ’ను విడుదల చేసిన సుకుమార్‌

జైద్‌ ఖాన్‌, సోనాల్‌ మోన్‌టైరో హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘బనారస్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది. జయతీర్థ దర్శకత్వంలో తిలక్‌రాజ్‌ బల్లాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని ‘మాయ గంగ’ పాటను మంగళవారం దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘స్నేహితుడి కోసం తిలక్‌రాజ్‌ ఈ సినిమా చేయడం గొప్ప విషయం. ‘బెనారస్‌’ సినిమా ఎలా ఉంటుందో ‘మాయ గంగ’ పాట చెప్పేస్తుంది. హీరో జైద్‌ఖాన్‌ నాన్నగారు కర్నాటకలో పెద్ద పొలిటీషియన్‌. అయినా సినిమాలంటే ఆసక్తితో జైద్‌ ఈ ఫీల్డ్‌లోకి వచ్చారు. పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత తిలక్‌రాజ్‌ బల్లాల చెప్పారు. తమ సినిమాను ఆదరించాలని దర్శకుడు జయతీర్థ కోరారు. 

Updated Date - 2022-06-30T05:55:09+05:30 IST