కాశీ నేపథ్యంలో Banaras..

ABN , First Publish Date - 2022-07-02T19:38:55+05:30 IST

శాండల్‌వుడ్‌కు పరిచయమవుతున్న కొత్త నటుడు జైద్‌ఖాన్‌ (jaidkhan) హీరోగా ఒక పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కింది. కాశీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందుతోంది. ‘బెనారస్‌’ (Banaras )

కాశీ నేపథ్యంలో Banaras..

శాండల్‌వుడ్‌కు పరిచయమవుతున్న కొత్త నటుడు జైద్‌ఖాన్‌ (jaidkhan) హీరోగా ఒక పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కింది. కాశీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందుతోంది. ‘బెనారస్‌’ (Banaras ) పేరుతో రూపొందిన ఈ చిత్రంలోని ‘మాయాగంగా’ అనే సింగిల్‌ ట్రాక్‌ను ఇటీవల నగరంలో విడుదల చేశారు. సీనియర్‌ నిర్మాత, హీరో విశాల్‌ (Vishal) తండ్రి జీకే రెడ్డి (G K Rddy) ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పాటను ఆవిష్కరించారు. ఏఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తిలక్‌ రాజ్‌ బల్లాల్‌ నిర్మించిన ఈ చిత్రానికి జయతీర్థా (Jayateertha) దర్శకత్వం వహించారు. జైద్‌ఖాన్‌ సరసన సోనల్‌ మంటోరియో (Sonal Monteiro) నటించగా సీనియర్‌ కన్నడ నటుడు దేవరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌, సుజయ్‌ శాస్త్రి, ఫరకత్‌ అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 


ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘బెనారస్‌’ చిత్రంలోని ‘మాయాగంగా’ తమిళ ట్రాక్‌ను తాజాగా విడుదలచేశాం. ఇది కాశీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రం. ప్రేమ అంటే బాహ్య సౌందర్యం కాదు. అంతర్‌ సౌందర్యం అని చాటిచెప్పేలా కథ సాగుతుంది. ఈ చిత్రానికి ముందు కన్నడంలో ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించాను.  నేను ఎవరివద్దా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. వీధి నాటక కళాకారుడిగా జర్నీ ప్రారంభించి దర్శకుడిగా మారాను. 


ఇపుడు ఈ చిత్రంతో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాం’.. అని తెలిపారు. నిర్మాత జీకే రెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్మాత తిలక్‌ రాజ్‌ నా చిరకాల మిత్రుడు. ఆయన నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని సింగిల్‌ ట్రాక్‌ రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంన్నారు. హీరో జైద్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ‘నా తొలి చిత్రమే పాన్‌ ఇండియా మూవీ కావడం ఎంతో ఆనందంగా ఉంది’.. అని అన్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చగా తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ కార్యక్రామానికి టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ కూడా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2022-07-02T19:38:55+05:30 IST