Weekend Box Office: బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' కలెక్షన్స్ ప్రభంజనం!

ABN , First Publish Date - 2022-09-26T19:58:34+05:30 IST

ఈమధ్య ప్రతీ శుక్రవారం (Friday) మూడు నాలుగు సినిమాలు కూడా విడుదల (Release) అవుతున్నాయి. కానీ కలక్షన్స్ (Collections) మాత్రం అంతంత మాత్రం గానే ఉంటున్నాయి.

Weekend Box Office: బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' కలెక్షన్స్ ప్రభంజనం!

ఈమధ్య ప్రతీ శుక్రవారం (Friday) మూడు నాలుగు సినిమాలు కూడా విడుదల (Release) అవుతున్నాయి.  కానీ కలక్షన్స్ (Collections) మాత్రం అంతంత మాత్రం గానే ఉంటున్నాయి. మొన్న శుక్రవారం నాడు, సెప్టెంబర్ 23, అయిదు సినిమాలు విడుదల అయ్యాయి. నాగశౌర్య (Naga Shaurya) నటించిన 'కృష్ణ వృంద విహారి' (Krishna Vrinda Vihari), శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన 'అల్లూరి' (Alluri), పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) నుండి వచ్చిన 'దొంగలున్నారు జాగ్రత్త' (Dongalunnaru Jagratha) ఇంకా చివరగా బాలకృష్ణ (నందమూరి Balakrishna) నటించిన 'చెన్నకేశవ రెడ్డి' (Chennakesava Reddy) మళ్ళీ విడుదల (Re-release) చేసారు. 


అలాగే ఇంగ్లీష్ సినిమా 'అవతార్' (Avatar) కూడా మళ్ళీ విడుదల చేసారు. ఆసక్తికరం అయినా అంశం ఏంటి అంటే, మళ్ళీ విడుదల అయిన పాత సినిమాలు 'చెన్నకేశవ రెడ్డి' మరియు 'అవతార్' కలెక్షన్స్ బాగున్నాయి, కానీ మిగతా సినిమాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. 'అల్లూరి' సినిమా విడుదల అవటమే ఆర్హిక లావాదేవీలు (Financial problems) కారణంగా చాలా లేట్ గా విడుదల చేశారు. శ్రీవిష్ణు మొదటిసారిగా (Frist time) ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు, కానీ జనాలకి ఇది సరిగ్గా ఎక్కలేదు. అలాగే నాగశౌర్య నటించిన 'కృష్ణ వృంద విహారి' ప్రభావం కూడా ఏమి లేదు. ఇది ఇంతకు ముందు వచ్చిన నాని సినిమా 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) కాపీగా వచ్చింది. అందువల్ల దీని ప్రభావం ఏమి కనపడలేదు. 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమా కేవలం ఓటిటి (OTT) కోసమని ముందుగా ఒకరోజు అయినా సినిమా థియేటర్ లో విడుదల చెయ్యాలన్న నిబంధన వున్న కారణంగా విడుదల చేసారు అనిపించింది. ఆ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. రెండో రోజు ఉందొ లేదో కూడా తెలియదు. 


ఇంకా బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవ రెడ్డి' 20 సంవత్సరాల తరువాత మళ్ళీ విడుదల చేసారు. ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. వేసిన షోస్ అన్నీ కూడా హౌసేఫుల్స్ అవ్వటం, బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాకి ప్రమోషన్స్ లేకున్నా కూడా పండగ లాగ సెలెబ్రేట్ చేసుకున్నారు. 'అవతార్' ఇంగ్లీష్ సినిమా కూడా అలాగే మళ్ళీ విడుదల చేసారు, అది కూడా కలెక్షన్స్ లో పరవాలేదు అనిపించింది. ఇలా మళ్ళీ విడుదల అవుతున్న పాత సినిమాల కలెక్షన్స్ మాత్రమే ఈ మధ్య బాగుంటున్నాయి. 

Updated Date - 2022-09-26T19:58:34+05:30 IST