Balakrishna: కమెడియన్ కాళ్లు పట్టుకోబోయిన బాలయ్య.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-09-11T00:39:21+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఏది చేసినా సంచలనమే. వాస్తవానికి బాలయ్య అంటే షూటింగ్‌లో అందరూ భయపడుతుంటారు. ఆయన సీరియస్‌గా ఉంటారని..

Balakrishna: కమెడియన్ కాళ్లు పట్టుకోబోయిన బాలయ్య.. వీడియో వైరల్

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఏది చేసినా సంచలనమే. వాస్తవానికి బాలయ్య అంటే షూటింగ్‌లో అందరూ భయపడుతుంటారు. ఆయన సీరియస్‌గా ఉంటారని, ఆయన ముందు ఎవరైనా తేడాగా ప్రవర్తించినా, తింగరి వేషాలు వేసినా.. వెంటనే ఆయనకి టెంపర్ లేచిపోతుందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. షూటింగ్‌లో ఆయన ఎంత జోవియల్‌గా ఉంటారో అర్థమవుతోంది. ఇతర కళాకారులంటే ఆయనకి ఎంత గౌరవమో.. ఈ వీడియో తెలియజేస్తోంది. ఈ వీడియో చూశాక.. బాలయ్యపై ఉన్న అభిప్రాయాన్ని కచ్చితంగా అందరూ మార్చుకుంటారు. బాలయ్య (Balayya) మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకుంటారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందని అనుకుంటున్నారు కదా. తనతో పాటు కాదు కాదు.. తనకంటే బెటర్‌గా ఓ డైలాగ్ చెప్పిన కమెడియన్ కాళ్లు పట్టుకోబోయారు బాలయ్య. అవును ఇది నిజం. కావాలంటే వీడియో చెక్ చేసుకోండి. 


ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ‘NBK107’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. టర్కీలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కీలక తారాగణం అంతా పాల్గొంటున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో కమెడియన్ సప్తగిరి, బాలయ్య పోటీపడి మరీ ఓ పౌరాణికి చిత్రంలోని అరివీర భయంకరమైన డైలాగ్ చెబుతున్నారు. స్టార్టింగ్ ఇద్దరూ ఒకే టోన్‌లో మొదలెట్టినా.. డైలాగ్ మధ్యలో బాలయ్య ఆపేశారు.. సప్తగిరి మాత్రం ఆపకుండా పూర్తి చేశాడు. దీంతో సప్తగిరి (Saptagiri) టాలెంట్ చూసి బాలయ్య ఫిదా అయ్యారు. వెంటనే ‘ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా’ అంటూ సప్తగిరి కాళ్లు పట్టుకోబోయారు. బాలయ్య ఈ ప్రయత్నాన్ని చూసిన సప్తగిరి షాకయ్యి.. వెంటనే బాలయ్య కాళ్ళపై పడి.. ఇక అలానే కూర్చుండిపోయాడు. అయినాసరే వదలకుండా.. ‘నీ రెండు కాళ్లు ఒకసారి పైకి ఎత్తరా.. దండం పెడతా..’ అంటూ మరోసారి బాలయ్య సరదాగా మాట్లాడి నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





Updated Date - 2022-09-11T00:39:21+05:30 IST