సౌత్ సినిమాలు బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో పాన్ ఇండియా సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. దీంతో అందరూ రాజమౌళి బాటలోనే నడుస్తున్నారు. ‘బాహుబలి’ తో ప్రభాస్ స్టార్డమ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అతడు నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలతో పోటీపై స్పందించాడు.
ప్రతి రంగంలో పోటీ ఉంటుందని ప్రభాస్ తెలిపాడు. సినీ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు ఏమీ కాదని పేర్కొన్నాడు. పాన్ ఇండియా సినిమాలు గతం నుంచే ఉన్నాయని చెప్పాడు. కానీ, ఈ సినిమాలపై ప్రస్తుతం అవగాహన పెరిగిందన్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘మై నే ప్యార్ కియా’ అటువంటి చిత్రమే అని వెల్లడించాడు. ఆ సినిమాలో సల్మాన్ నటనకు ప్రభాస్ తాతయ్య ఫిదా అయ్యాడట. పాన్ ఇండియా సినిమాలతో లాభం కూడా ఉందని చెప్పాడు. ‘‘పాన్ ఇండియా సినిమాలను ప్రతి ఒక్కరు తెరకెక్కించడం మొదలుపెడితే.. ఆ మూవీస్ మన బోర్డర్స్‌ను క్రాస్ చేస్తాయి. పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించడంలో ఇప్పటికే ఆలస్యం అయింది. ఇప్పుడే అటువంటి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాం. అవి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నాయి. సౌత్, నార్త్‌కు చెందిన వారంతా కలసి త్వరలోనే మరిన్ని ఇండియన్ సినిమాలను నిర్మిస్తారు’’ అని ప్రభాస్ తెలిపాడు. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ గురించి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘‘రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నేను చూశాను. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు తెరకెక్కించాడు కాబట్టి అది తప్పకుండా భారీ వసూళ్లను రాబడుతుందన్నాడు. అతడు సౌత్ డైరెక్టర్ కాదు. ఇండియన్ డైరెక్టర్. ఇప్పటికే ఈ చిత్రం రూ.1100 కోట్ల నుంచి రూ.1200కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి హిట్‌గా నిలిచింది’’ అని ప్రభాస్ స్పష్టం చేశాడు.