సిద్దార్థ్ క్షమాపణలకు రిప్లై ఇచ్చిన సైనా నెహ్వాల్

ABN , First Publish Date - 2022-01-12T20:50:46+05:30 IST

సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

సిద్దార్థ్ క్షమాపణలకు రిప్లై ఇచ్చిన సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర  దుమారం లేపింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.  సైనాను ‘‘ ‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ ’’ అనడంతో ప్రముఖులందరు ఖండించారు. దీంతో ఆమెకు క్షమాపణలు చెబుతూ సిద్దార్థ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.


‘‘ డియర్ సైనా. కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్‌కు సమాధానంగా ఒక పోస్ట్ పెట్టాను. నీ మీద దారుణమైన జోక్ వేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. నా అసంతృప్తి, కోపాన్ని సరి అయిన పదాలతో వ్యక్త పరచలేదు. మనం జోక్ చేసినప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తే అది మంచి జోక్ కాదు. అలాంటి జోక్ వేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. చాలామంది చెబుతున్నట్లుగా ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశంతో నేను ఆ ట్వీట్ చేయలేదు. నేను ఫెమినిస్టులకు అండగా ఉండే వ్యక్తిని. ఒక మహిళగా మీపై దాడి చేయాలనే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. ఇవన్ని మరిచిపోయి నేను చెప్పిన క్షమాపణలను మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడు మా ఛాంపియన్‌వే  ’’ అని సిద్దార్థ్ ట్విట్టర్‌లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. 


సిద్దార్థ్ క్షమాపణలు చెప్పడంతో సైనా రిప్లై ఇచ్చింది. ‘‘ అతడే ట్విట్టర్‌లో ఆ విధంగా అన్నారు. ప్రస్తుతం క్షమాణలు చెబుతున్నారు. సిద్దార్థ్ ట్వీట్ చేసిన రోజు నేను ట్విట్టర్‌లో ట్రెండ్ అయినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. అతడితో ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. కానీ, అతడు క్షమాపణలు చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ ట్వీట్ మహిళకు సంబంధించినది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి వాటిని నేను పట్టించుకొను. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. దేవుని ఆశీస్సులు అతడికి ఉండాలి ’’ అని సైనా నెహ్వాల్ తెలిపింది.

Updated Date - 2022-01-12T20:50:46+05:30 IST