Kapoor House : బాలీవుడ్ సీనియర్ నటుడి ఇళ్లు చూస్తే WOW అనకుండా ఉండలేరు!

ABN , First Publish Date - 2021-12-10T16:41:04+05:30 IST

‘బడే అచ్ఛే లగ్‌తే హై’ డైలీ సీరియల్‌తో పాప్యులర్ అయిన సీనియర్ నటుడు రామ్ కపూర్ నాలుగు విలాసవంతమైన భవనాలకు యజమాని. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఆయన ఈ మధ్యే అలీబాగ్ ప్రాంతంలో మరో ఇళ్లు స్వంతం చేసుకున్నాడు. అయితే, ముంబై మహానగరం మధ్యలో ఉండే నివాస గృహం సకల సౌకర్యాలు కలిగి ఉండగా... కాస్త దూరంగా అలీబాగ్‌లో ఉన్న ఇల్లు సకల సౌందర్యాలతో మాయ చేస్తోంది!

Kapoor House : బాలీవుడ్ సీనియర్ నటుడి ఇళ్లు చూస్తే WOW అనకుండా ఉండలేరు!

‘బడే అచ్ఛే లగ్‌తే హై’ డైలీ సీరియల్‌తో పాప్యులర్ అయిన సీనియర్ నటుడు రామ్ కపూర్ నాలుగు విలాసవంతమైన భవనాలకు యజమాని. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఆయన ఈ మధ్యే అలీబాగ్ ప్రాంతంలో మరో ఇళ్లు స్వంతం చేసుకున్నాడు. అయితే, ముంబై మహానగరం మధ్యలో ఉండే నివాస గృహం సకల సౌకర్యాలు కలిగి ఉండగా... కాస్త దూరంగా అలీబాగ్‌లో ఉన్న ఇల్లు సకల సౌందర్యాలతో మాయ చేస్తోంది! 


రామ్ కపూర్ కొత్త ఇంట్లో మనల్ని మొదటగా ఆకట్టుకునేది లివింగ్ ఏరియా. అతిథులకి ఆహ్వానం పలికే ఈ హాలు అవతల నుంచీ పచ్చటి పెరళ్లు కనిపిస్తుంటే లోన ఉన్న మొక్కలు, రంగురంగుల కుషన్స్‌తో మనస్సుని ఉల్లాసపరుస్తుంది!


చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు, టీవీ నటులు అలీబాగ్ లాంటి ప్రాంతాల్లో అదనంగా ఇళ్లు కొనేస్తున్నారు. నగరానికి మరీ దూరంగా కాకుండా, అలాగే మరీ రణగొణ ధ్వనుల నడుమ కాకుండా ఉండటంతో వీకెండ్ స్టేస్‌కు ఇవ్వి బాగా సూటవుతాయి. అందుకే, రామ్ కపూర్ కూడా తన తాజా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయించుకున్నారు... 


డైనింగ్ ఏరియా కూడా చాలా అద్భుతంగా తీర్చిద్దిద్దారు లగ్జరీ హోమ్‌లో. భారీ కిటికీలు ధారళంగా ఎండ, వెలుతురు వచ్చేలా చేస్తుంటాయి. అలాగే, డైనింగ్ టేబుల్, కుర్చీలు కూడా ఎంతో జాగ్రత్తగా కలర్ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేశారు. తన మనవళ్లు, మనవరాళ్లు కొత్త ఇంట్లో ఆడుకుంటుంటే చూడటం ఎంతో ఆనందంగా ఉంటుందని రామ్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.... 



గోవా, ఖండాలా ప్రాంతాల్లోనూ రామ్ కపూర్‌కి హాలీడే హోమ్స్ ఉన్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు అలీబాగ్ ఇల్లు జత చేరింది. అయితే, ఆయన ప్రధానంగా ఉండేది సౌత్ ముంబైలోని ఇంట్లోనే. షూటింగ్స్‌ వెళ్లటానికి అనుకూలంగా సిటీ మధ్యలో ఉంటుంది ఈ ఇల్లు. ఇదే పద్ధతి చాలా మంది ముంబై సెలబ్స్ పాటిస్తుంటారు. వీకంతా సిటీలో, వీకెండ్ నగరానికి దూరంగా....

రామ్ కపూర్ సౌత్ ముంబై హోమ్ కూడా అందంగానే ఉంటుంది. ముద్దొచ్చే సోఫా సెట్లు, గంభీరంగా కనిపించే డైనింగ్ టేబుల్ వంటి రెగ్యులర్ ఏర్పాట్లే కాకుండా జిమ్ రూమ్‌ని కూడా మనం చూడవచ్చు.







Updated Date - 2021-12-10T16:41:04+05:30 IST