‘మా’ లో గోప్యంగా నియామకాలు

ABN , First Publish Date - 2021-11-10T21:56:10+05:30 IST

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత ప్రతీది చాలా గోప్యంగా జరుగుతోంది. ‘మా’ ఎన్నికల అనంతరం ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన సభ్యులు రాజీనామాలు చేసి.. పూర్తిగా మంచు విష్ణు ప్యానలే అధికారంలో ఉండి.. అభివృద్ది కార్యక్రమాలు

‘మా’ లో గోప్యంగా నియామకాలు

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత ప్రతీది చాలా గోప్యంగా జరుగుతోంది. ‘మా’ ఎన్నికల అనంతరం ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన సభ్యులు రాజీనామాలు చేసి.. పూర్తిగా మంచు విష్ణు ప్యానలే అధికారంలో ఉండి.. అభివృద్ది కార్యక్రమాలు జరపాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన సభ్యులు రాజీనామాలు ఇంకా మా వద్దకు రాలేదని.. ఆ మధ్య తెలిపిన మంచు విష్ణు.. ఇప్పుడు వారి స్థానంలో ఏకంగా తన ప్యానల్‌లో పోటీ చేసి ఓడిపోయిన వారిని నియమించేశారు. రీసెంట్‌గా ‘మా’ తరపున దీపావళి గ్రీటింగ్స్ చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.


‘మా’లో ఏదైనా పారదర్శకంగా చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో గెలిచిన సభ్యులు రాజీనామా చేసినట్లుగానీ, వారి స్థానంలో తన ప్యానల్‌లో ఓడిపోయిన వారిని తీసుకున్నట్లుగా.. ఎక్కడా బయటకి తెలియనివ్వలేదు. దీంతో ఎన్నికైన తర్వాత ప్రతి విషయంలో మంచు విష్ణు గోప్యతను పాటించడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి పవర్స్ తన చేతికి వచ్చేసినట్లుగా మంచు విష్ణు భావిస్తున్నాడని, అందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని వారంతా అనుకుంటుండటం విశేషం. కాగా, ‘మా’ బైలాస్‌లోని క్లాజ్ 17కు అనుగుణంగా 03 నవంబర్, 2021న ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ స్థానంలో బాబూమోహన్‌నూ, వైస్ ప్రెసిడెంట్ స్థానంలో పృధ్వీరాజ్‌ను ఈసీ నియమించినట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2021-11-10T21:56:10+05:30 IST