సల్మాన్ ఖాన్‌ని ముద్దులతో ముంచెత్తిన మాజీ ఎమ్మేల్యే.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-19T15:26:51+05:30 IST

బాబా సిద్ధిఖీ.. 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు వాండ్రే వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున..

సల్మాన్ ఖాన్‌ని ముద్దులతో ముంచెత్తిన మాజీ ఎమ్మేల్యే.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

మహారాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడుసార్లు అంటే 1999, 2004, 2009ల్లో వాండ్రే వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన రాజకీయ నాయకులు బాబా సిద్ధిఖీ. ఆయన చాలాకాలంగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రంజాన్ సందర్భంగా బాలీవుడ్, రాజకీయ ప్రముఖులకు ఇఫ్తార్ పార్టీ ఇస్తుంటారు. అయితే కరోనా గడ్డు పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. పరిస్థితులు కొంచెం కంట్రోల్‌కి వచ్చిన ఈ తరుణంలో ఈ ఏడాది బాబా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అందులో.. సల్మాన్ ఖాన్ కారులో కూర్చుని పార్టీ నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆ తరుణంలో ఆయనకి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన బాబా సిద్ధిఖీ, సల్లు భాయ్‌ని గట్టిగా కౌగిలించుకొని ముద్దులతో ముంచెత్తాడు. దీంతో సల్మాన్ ఎంతో సిగ్గుపడిపోతూ కూర్చున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. సల్మాన్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-04-19T15:26:51+05:30 IST