Samantha తొలి బాలీవుడ్ ఎంట్రీ ఖాయం.. హీరో అతడేనా?

ABN , First Publish Date - 2022-07-06T17:29:56+05:30 IST

‘ఫ్యామిలీ మేన్ 2’ (Family man 2)బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో అందాల సమంత (Samantha) తొలిసారిగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆమె చేరికతో ఆ సిరీస్ సీజన్ 1 కన్నా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Samantha తొలి బాలీవుడ్ ఎంట్రీ ఖాయం.. హీరో అతడేనా?

‘ఫ్యామిలీ మేన్ 2’ (Family man 2) బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో అందాల సమంత (Samantha) తొలిసారిగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆమె చేరికతో ఆ సిరీస్ సీజన్ 1 కన్నా మంచి క్రేజ్ తెచ్చుకుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో సామ్ అభినయం అందరినీ మెప్పించింది. ఈ నేపథ్యంలో సమంత మరో వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్టు వార్తలొస్తుండగా.. కథానాయికగా ఆమె తొలి బాలీవుడ్ ఎంట్రీపై కూడా కథనాలు వస్తున్నాయి. అంతేకాదండోయ్.. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) సరసన ఆమె కథానాయికగా ఖాయం అయినట్టు కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఆయుష్మాన్..  ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్‌లో హీరోగా ప్రమోట్ అయ్యాడు. బడా కాంబినేషన్స్‌లో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నాడు.  


హ్యూమర్, సస్పెన్స్ మిళితమైన కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. మడాక్ ఫిల్మ్స్ (Maddock Films), పీపింగ్ మూన్ (Peeping Moon) సంయుక్త బ్యానర్స్‌‌లో దినేష్ విజయన్ (Dinesh Vijayan) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఈ ఏడాది చివరలో సెట్స్‌పైకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అప్పటికి సమంత, ఆయుష్మాన్ కమిట్‌మెంట్స్ పూర్తవుతాయి. ఈ సినిమాలో సామ్.. ఆయుష్మాన్‌ పాత్రతో సమానమైన పాత్రను చేయబోతోందట. సమంత క్రేజీ రోల్ చేస్తున్నట్టు, ఆమెకి ఆ పాత్ర చాలా బాగా నచ్చినట్టు  బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే సమాంత ఈ ప్రాజెక్ట్ కు ఇంకా సైన్ చేయలేదు. 


ఆల్రెడీ సమంతా బాలీవుడ్‌లో తాప్సీ (Tapsee) సొంత సినిమాలో లీడ్ రోల్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సమంతతో తాప్సీ సంప్రదింపులు జరుపుతోందట. సామ్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతోందట. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మరో పక్క రాజ్ - డీకే (Raj and Dk) దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ‘సిటాడెల్’ (Citadel) సిరీస్‌కు ఇది ఇండియన్ వెర్షన్ అని తెలుస్తోంది. మరి ఆయుష్మాన్ ఖురానా తో సామ్.. తొలి బాలీవుడ్ ఎంట్రీ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-06T17:29:56+05:30 IST