RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ ను ప్రశంసించిన అవెంజర్స్ దర్శకుడు

ABN , First Publish Date - 2022-07-24T01:08:11+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా

RRR: ‘ఆర్ఆర్ఆర్‌’ ను ప్రశంసించిన అవెంజర్స్ దర్శకుడు

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1200కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంలో చూసిన వారంతా ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాప్ హాలీవుడ్ డైరెక్టర్ చేరాడు. 


‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’, ‘అవెంజర్ ఎండ్ గేమ్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి జో రుస్సో (Joe Russo). ది గ్రే మ్యాన్ ప్రమోషన్స్‌ల్లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ‘‘ఆర్ఆర్ఆర్ అద్భుతమైన చిత్రం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో రికార్డ్ వీక్షణలతో దూసుకుపోతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సోదరభావాన్ని అద్భుతంగా చూపించారు’’ అని జో రుస్సో పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడు స్కాట్ డెరిక్సన్, రైటర్ రాబర్ట్ కార్గిల్, ‘గార్డియన్స్ ఆప్ గెలాక్సీ’ డైరెక్టర్ జేమ్స్ గాన్ తదితరులు ప్రశంసించారు.

Updated Date - 2022-07-24T01:08:11+05:30 IST