Avatar2: May 6న థియేటర్లలో సందడి చేయనున్న అవతార్2 Glimpse.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-04-27T23:07:31+05:30 IST

James Cameron మరోమారు మనల్ని Avatar2 సినిమాతో థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా..

Avatar2: May 6న థియేటర్లలో సందడి చేయనున్న అవతార్2 Glimpse.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

హాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘Avatar’ థియేటర్లలో విడుదలై దాదాపు 13 ఏళ్లు కావొస్తోంది. కానీ.. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే కాసేపు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి వీక్షకులకు కలుగుతుంది. అంతటి అద్భుత ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు అందించిన ఆ సినిమా డైరెక్టర్ James Cameron మరోమారు మనల్ని Avatar2 సినిమాతో థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్లో Avatar2 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. అదేంటంటే.. Avatar2 సినిమా విడుదల తేదీ బయటికొచ్చేసింది. డిసెంబర్ 16, 2022న Avatar2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదల కాబోతున్నట్లు టాక్.


అంతేకాదు.. CinemaCon వేదికగా ప్రపంచ నలుమూలల నుంచి హాజరయిన సినీ ప్రముఖల సమక్షంలో Avatar2 Glimpse బుధవారం (ఏప్రిల్ 27) ప్రదర్శితం కాబోతున్నట్లు తెలిసింది. అయితే.. ఈ Glimpse చూసే భాగ్యం కేవలం Las Vegasలోని CinemaCon ఈవెంట్‌కు హాజరయ్యే వారికి మాత్రమే ఉండటం గమనార్హం. ప్రేక్షకుల కోసం Avatar2 Glimpseను మే 6న థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే Avatar2 సినిమాను కూడా తెరకెక్కించారు. థియేటర్లలో 3D, 4K, 48 fps ఫార్మాట్‌లో కూడా Avatar2 సినిమాను విడుదల చేయనున్నట్లు టాక్.



ప్రేక్షకులు ఇలాంటి సినిమా నుంచి మరో కొత్త లోకాన్ని ఆశిస్తారు కనుక అందుకు తగ్గట్టుగానే Avatar2 క్వాలిటీ విషయంలో మేకర్స్ ఏమాత్రం రాజీపడటం లేదు. Avatar సినిమా ప్రపంచవ్యాప్తంగా $2.8 బిలియన్ డాలర్ల గ్రాస్ కొల్లగొట్టి Digital 3D Eraలో ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. 20th Century Studios సంస్థ అవతార్ సీక్సెల్స్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. Avatar సినిమాకు సీక్వెల్స్‌గా Avatar2 2022లో, Avatar3 2024లో, Avatar4 2026లో, Avatar5 2028లో విడుదల కాబోతున్నాయి. అవతార్ సినిమా తర్వాత James Cameron అవతార్2 సినిమాపై ఇన్నేళ్లు తన సమయాన్ని వెచ్చించడంతో Avatar2 సినిమా కచ్చితంగా Avatar కంటే అద్భుతంగా ఉండొచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Updated Date - 2022-04-27T23:07:31+05:30 IST