Putinకు వేలెత్తి చూపిన ఆస్ట్రేలియన్ డేరింగ్ బ్యూటీ!

ABN , First Publish Date - 2022-03-15T03:49:38+05:30 IST

ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచాన్ని కుదిపేస్తోన్న తీవ్రమైన సమస్య రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈస్ట్రన్ యూరప్‌లోని ఉక్రెయిన్‌పైకి పుతిన్ సేనలు దండెత్తటంతో వెస్ట్రన్ యాక్టర్స్ కామ్‌గా ఉండలేకపోతున్నారు. కొందరు విరాళాలు ఇస్తున్నారు, మరికొందరు ఫండ్స్ రైజ్ చేస్తున్నారు, ఇంకొందరు సొషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాదాపుగా యూరోపియన్, అమెరికన్ నటీనటులందరూ రష్యాకి, పుతిన్‌కి వ్యతిరేకంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఆస్ట్రేలియన్ నటి కూడా రంగంలోకి దిగింది. వ్లాదిమర్ పుతిన్ లాంటి అగ్ర నాయకుడ్ని తీవ్రంగా అవమానించింది...

ప్రతీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్’ ఈ సారి కూడా అట్టహాసంగా కొనసాగాయి. అయితే, పురస్కారాల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నటి రెబెల్ విల్సన్ మాత్రం తన పేరుకి తగ్గట్టుగా ప్రవర్తించింది. రెబెల్ అన్నపేరుని నిజం చేస్తూ రష్యా లాంటి అగ్ర దేశానికి అధ్యక్షుడైన పుతిన్‌కు మధ్య వేలు చూపింది! ఇది పుతిన్ కోసమేనంటూ సూటిగా చెప్పిన... 42 ఏళ్ల రెబెల్ విల్సన్... ఎదురుగా ఉన్న జనంతో పాటూ మీడియా కెమెరాలకు కూడా తన మిడిల్ ఫింగర్ కనపడేలా ఎత్తి చూపింది. 

వెస్ట్రన్ కంట్రీస్‌లో చేతి మధ్య వేలు ఎత్తి చూపటం తప్పుగా భావిస్తారు. అందుకే, రెబెల్ విల్సన్ మిడిల్ ఫింగర్ చూపించటం ద్వారా పుతిన్‌పై ధిక్కారాన్ని ప్రదర్శించింది. ఇదంతా ‘బాఫ్టా’ వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కనిపించింది. ‘‘సైన్ లాంగ్వేజ్ ద్వారా పాఠం నేర్పిన రెబెల్ విల్సన్...’’ అని క్యాప్షన్ రాశారు సదరు కాంట్రవర్సియల్ వీడియోకి... 

Updated Date - 2022-03-15T03:49:38+05:30 IST