Project k: అవెంజర్స్‌ రేంజ్‌ సినిమా!

ABN , First Publish Date - 2022-07-28T21:52:26+05:30 IST

‘బాహుబలి’ సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు ప్రభాస్‌(Prabhas). ఆ తర్వాత ఆయన అంగీకరించిన చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఇదే క్రేజ్‌లో ఆయన ప్యాన్‌ వరల్డ్‌ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారని సినీ విశ్లేషకులు, అభిమానులు చెబుతున్నారు.

Project k: అవెంజర్స్‌ రేంజ్‌ సినిమా!

‘బాహుబలి’ సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు ప్రభాస్‌(Prabhas). ఆ తర్వాత ఆయన అంగీకరించిన చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ఇదే క్రేజ్‌లో ఆయన ప్యాన్‌ వరల్డ్‌ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారని సినీ విశ్లేషకులు, అభిమానులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఆయన నటించే చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (Project k)ఉండబోతుందని అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ (Aswini dutt) హింట్‌ ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌ (Nag aswin)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ (vyjayanti movies) నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి అశ్వనీదత్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘హాలీవుడ్‌ అవెంజర్స్‌ స్ఠాయిలో ‘ప్రాజెక్ట్‌ కె’ ఉండబోతుందని, ఈ సినిమాతో చైనా అమెరికా మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తామని ఆయన తెలిపారు. 


‘‘ప్రాజెక్ట్‌ కె’ ఇండియన్‌ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లబోతుంది. ప్రభాస్‌, దీపికా సినిమా కోసం చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌కి షూటింగ్‌ పూర్తవుతుంది. భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రాఫిక్స్‌ కోసం 9 నెలలు కేటాయించాం. ‘అవెంజర్స్‌’ రేంజ్‌లో ‘ప్రాజెక్ట్‌ కె’ ఉంటుంది. 2024 అక్టోబర్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అని అశ్వనీత్‌ దత్‌ వెల్లడించారు. (Aswini dutt about project k)


Updated Date - 2022-07-28T21:52:26+05:30 IST