Aswini dutt: ఆ సినిమా తర్వాత కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌!

Twitter IconWatsapp IconFacebook Icon
Aswini dutt: ఆ సినిమా తర్వాత కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌!

‘జగదేక వీరుడు అతిలోక సుందరి 2’ (Jagadekaveerudu athiloka sundari2 )సినిమా తీసి తన సినీ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంటున్నారు వైజయంతీ మూవీస్‌ అధినేత సి. అశ్వినీదత్‌ (Aswini dutt). 50 ఏళ్ల జర్నీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన తాజాగా ‘సీతారామం’ (Sitaramam)చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సక్సెస్‌ ఆస్వాదిస్తూ.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.  ఎన్టీఆర్‌ను ఎప్పుడూ దైవంగా భావిస్తానని చెప్పారు. నిర్మాణరంగంలో అడుగుపెట్టిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నిర్మాతగా కెరీరీ ప్రారంభిన సమయంలో రూ.16 లక్షలతో సినిమా తీసినట్లు తెలిపారు. అల్లు అరవింద్‌తో కలిసి ‘చూడాలని ఉంది’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసి చేరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. తన కుమార్తెలు నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జాతిరత్నాలు’ చూసి కడుపుబ్బా నవ్వుకున్నానని తెలిపారు. ‘స్టూడెంట్‌ నెం. 1’ చిత్రానికి మొదట ప్రభాస్‌ని హీరోగా అనుకున్నాననీ, చివరకు ఎన్టీఆర్‌ ఓకే అయ్యారని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘అందరూ అనుకుంటున్నట్లు ఓటీటీ అనేది ప్రమాదకరమైనది కాదు. అదొక ప్రత్యామ్నాయ మార్గం. నా దృష్టిలో యూట్యూబ్‌ చాలా ప్రమాదకరం’’ అని అన్నారు. 




AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.