Brahmastra: సినిమా హిట్టే.. RRR, KGF 2 రికార్డులను మాత్రం..

ABN , First Publish Date - 2022-09-09T19:45:07+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’. దాదాపు ఐదేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం..

Brahmastra: సినిమా హిట్టే.. RRR, KGF 2 రికార్డులను మాత్రం..

దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’. దాదాపు ఐదేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఈరోజు (సెప్టెంబర్ 9న) ప్రపంచవ్యాప్తంగా 8000వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైంది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్యపాత్రలు పోషించారు. అయితే విడుదలకి ముందే సోషల్ మీడియా వేదికగా సినిమాల రివ్యూల చెబుతూ.. ఈ చిత్రం రికార్డులు సృష్టింస్తుందని ట్వీట్లు చేశారు.


అయితే.. పండిట్ జగన్నాథ్ గురూజీ అనే జ్యోతిష్యుడు బాలీవుడ్ సినిమాల ఫలితం గురించి ఊహిస్తూ ఉంటాడు. ‘బ్రహ్మాస్త్ర’ విడుదలైన ఈ తరుణంలో ఈ మూవీ గురించి ఆయన మాట్లాడారు.‘ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఆ విషయం ముందుగా చెప్పుకోవాలి. థియేటర్స్ నుంచి ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి అంత వెనక్కి వస్తుంది. నిర్మాతలు ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా సంతోషంగా ఉంటారు. అయితే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మాత్రం కాదు. ఇది ‘ఆర్ఆర్ఆర్ (RRR)’, ‘కేజీఎఫ్ 2 (KGF 2)’ రికార్డులను మాత్రం టచ్ చేయలేదు. వసూళ్లు సాధిస్తే.. సూపర్ హిట్‌గా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు.


అంతేకాకుండా ఆ జ్యోతిష్కుడు రణ్‌బీర్, ఆలియా గురించి మాట్లాడుతూ.. ‘వారిద్దరూ కెరీర్ ఇకపై కొంచెం ఇబ్బందుల్లో పడుతుంది. అంతేకాకుండా.. రణ్‌బీర్ కపూర్ కొన్ని రోజుల వరకూ సినిమా నిర్మాణానికి దూరంగా ఉండడం చాలా మంచిది’ అని తెలిపారు.

Updated Date - 2022-09-09T19:45:07+05:30 IST