Katrina Kaif ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. రెండు సంవత్సరాలు పడుతుందంటూ..

ABN , First Publish Date - 2022-07-17T17:08:04+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఒకరు. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని..

Katrina Kaif ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. రెండు సంవత్సరాలు పడుతుందంటూ..

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఒకరు. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఓ కోటలో ఎంతో గ్రాండ్‌గా ఈ జంట పెళ్లి చేసుకుంది. ఈ కపుల్ అప్పట్లోనే ఓసారి హానిమూన్‌కి వెళ్లారు. తాజాగా మరోసారి ఈ దంపతులు మాల్దీవులకి విహారానికి వెళ్లారు. అయితే.. వీరి పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చాయనేది అందరికీ తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కూడా పలు రకాల న్యూస్ హల్‌చల్ చేశాయి. తాజాగా సైతం ఈ కపుల్ గురించి ఓ క్రేజీ వార్తల నెట్టింట వైరల్ అవుతోంది.


మాల్దీవులకి వెళ్లేక్రమంలో విక్కీ, కత్రినా జంట ఎయిర్‌పోర్ట్‌‌లో మీడియా కంటపడ్డారు. ఆ సమయంలో కత్రినా చాలా లూజ్‌గా ఉన్న టీ షర్ట్ వేసుకుంది. దీంతో ఆమె గర్భవత(Pregnant) ని, బేబీ బంప్ కనిపించకుండా అలా వేసుకుందని ప్రచారం స్టార్ అయ్యింది. అంతేకాకుండా.. సినిమాల మధ్యలో కూడా చాలా గ్యాప్ ఉంది. అది ఈ రూమర్స్ పెరగడానికి మరో కారణం. ఈ వార్తలపై ప్రముఖ బాలీవుడ్ జోత్యిష్కుడు (Astrologer) సంజయ్ బీ జుమాని ఓ ఇంటర్య్వూలో స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


సంజయ్ మాట్లాడుతూ.. ‘కత్రినా ప్రస్తుత వయస్సు 40 సంవత్సరాలు. కాబట్టి ఆమె అనుకుంటే పిల్లలను కనొచ్చు. కానీ చాలా వరకు, అది వచ్చే సంవత్సరం అవుతుంది. ఆమె లక్కి నంబర్ 7. 2023 సంవత్సరంలోని అంకెలను కలిపితే 7 ఉంటుంది. ఆమెపై ఆ సంఖ్య ప్రభావం ఉంటుంది. కత్రినా కూడా తన కెరీర్‌ను రాబోయే రెండేళ్లపాటు పక్కన పెట్టేసి పిల్లలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది’ అని తెలిపారు. కాగా.. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘టైగర్ 3’, తమిళ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ‘మేరీ క్రిస్మస్’ సినిమాలు చేస్తోంది. అలాగే.. విక్కీ సైతం సారా అలిఖాన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.

Updated Date - 2022-07-17T17:08:04+05:30 IST