Ashwini Dutt: మరో జన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నా..

Twitter IconWatsapp IconFacebook Icon
Ashwini Dutt: మరో జన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నా..

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) - మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో.. స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Ashwini Dutt) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘సీతారామం’ (Sita Ramam).  హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. ప్రేక్షకుల చేత దృశ్యకావ్యంగా పరిగణించబడుతోంది. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్.. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ చిత్రంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ సక్సెస్‌తో మరో జన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నట్లుగా తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. (Ashwini Dutt Letter)


‘‘ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. 50వ సంవత్సరంలోకి అతి తొందరలో అడుగు పెట్టబోతున్న నిర్మాతగా నన్నూ, నా సంస్థలను, నా పిల్లలను ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా ప్రోత్సహిస్తూ, ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్న మీరంతా, ప్రేమకథా చిత్రాన్ని  నిర్మించాలన్న నా చిరకాల స్వప్నం.. ‘సీతారామం’ చిత్రానికి ఉవ్వెత్తున, మరపురాని అఖండ విజయాన్ని అందించినందుకు మీకెంతో రుణపడి ఉన్నాను. శంకరాభరణం, ప్రతిఘటన విడుదలనాటి ప్రకంపనలను గుర్తుచేస్తూ మా ఆల్‌టైం క్లాసిక్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి, శుభలగ్నం, ఇంద్ర, పెళ్లిసందడి, మహానటి చిత్రాల జాబితాలో సీతారామం చిత్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి, మా సంస్థకు మరో కలికితురాయిగా నిరూపించిన ప్రేక్షక దేవుళ్ళకు శతథా, సహస్రధా వందనాలు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కాదు.. తమిళ, కన్నడ, కేరళ ప్రేక్షకులు సైతం ‘సీతారామం’ చిత్రాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతూ, ప్రభంజనం సృష్టిస్తుంటే.. నిర్మాతగా మరోజన్మ ఎత్తినంత తన్మయత్వానికి లోనవుతున్నాను. ఈ చిత్ర నిర్మాణాన్ని రెండేళ్లపాటు ఒంటిచేత్తో నడిపించి మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన మా స్వప్నకు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. 

నిజమైన ప్రేమికులుగా మీ గుండెల్లో గూడు కట్టుకునే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌తో పాటు ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులందరినీ పేరుపేరునా అభినందించడం నా కర్తవ్యం. 

ఈ శుభసందర్భంలో ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ..

మీ.. అశ్వినీదత్ చలసాని’’ అని నిర్మాత అశ్వినీదత్ ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Sita Ramam Success)


కాగా, ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna), హీరో సుమంత్ (Sumanth), దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautam Vaudev Menon), తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కీలక పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar) సంగీతం సమకూర్చారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.