Ashwini Dutt: విమర్శించింది కానీ, నెగిటివ్‌గా మాట్లాడింది కానీ లేదు

ABN , First Publish Date - 2022-07-30T02:28:48+05:30 IST

యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ (ATFPG).. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ ఆపేస్తున్నామని చెప్పిన తర్వాత, ఫిల్మ్ నగర్‌లో నానా రచ్చ జరుగుతోంది. ఇండస్ట్రీ అయోమయ పరిస్థితిలో ఉందంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయంపై

Ashwini Dutt: విమర్శించింది కానీ, నెగిటివ్‌గా మాట్లాడింది కానీ లేదు

యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ (ATFPG).. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ ఆపేస్తున్నామని చెప్పిన తర్వాత, ఫిల్మ్ నగర్‌లో నానా రచ్చ జరుగుతోంది. ఇండస్ట్రీ అయోమయ పరిస్థితిలో ఉందంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయంపై గిల్డ్ ఎందుకు ఫాం అయ్యిందో? అది ఏం పని చేస్తుందో? హీరోలకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారని స్టార్ ప్రొడ్యూసర్, ఇండస్ట్రీ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన అశ్వినీ దత్‌ (Ashwini Dutt) కామెంట్స్ చేశారు అనే మాట ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతటి నిర్మాత, గిల్డ్ గురించి ఇలా అనడం ఏమిటని అంతా అనుకుంటున్నారు. 


నిజానికి అసలు అశ్వినీ దత్ మాటలు ఒకసారి వింటే... ఆయన ‘సీతా రామం’ (Sita Ramam) సినిమా గురించి మాట్లాడుతూ.. మనం ప్రొమోషన్స్ చేసే విధానం చూసి ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారు.. లేదా టాక్ విన్న తర్వాత అయినా సెకండ్ షో నుంచి పబ్లిక్ థియేటర్స్‌కి వస్తారు అని చెప్పారు. ఇక సినిమాల విషయం మాట్లాడుతూ.. సినిమా కష్టాల్లో ఉండడానికి కరోనా ఒక కారణమని... అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చని అన్నారు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు వున్నాయి.. అని ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న సీరియస్ ఇష్యూలని అశ్వినీ దత్ జెనిరిక్‌గా అడ్రెస్ చేశారు.


ఇదే సందర్భంలో గిల్డ్ గురించి కూడా టాపిక్ వస్తే... గిల్డ్‌లో స్వప్న వాళ్లు మెంబర్స్‌గా ఉన్నారు కానీ నేను లేను... అది ఎందుకు ఫాం అయ్యింది అంటే పిల్లలు ఏదో చెప్తూ ఉంటారు కానీ.. ఆ మాటలు నాకు అర్ధం కావు అని.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు పుట్టింది అనే విషయాన్ని అశ్వినీ దత్ చాలా క్లియర్‌గా చెప్పారు. ఇందులో ఆయన గిల్డ్‌ని విమర్శించింది కానీ, గిల్డ్ గురించి నెగటివ్‌గా మాట్లాడింది కానీ లేదు.. తప్పు మాట్లాడక పోయినా కూడా తన ఇంటెన్షన్ బయటకి తప్పుగా వెళ్ళిందని అర్థం చేసుకున్న అశ్వినీ దత్.. తన మాటలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.


‘‘యాభై ఏళ్లుగా చిత్రసీమ‌లో నిర్మాత‌గా కొన‌సాగుతున్నా. నా తోటి నిర్మాత‌లంద‌రితోనూ చాలా స‌న్నిహితంగా, సోద‌ర భావంగా మెలిగాను. ఏ నిర్మాత‌పైనా నాకు అగౌర‌వం లేదు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా... నిర్మాత‌లు, చిత్రసీమ శ్రేయ‌స్సు కోస‌మే ఉద్భవించాయి. ప‌రిశ్రమ కోసం అంద‌రూ ఒక్క తాటిపై న‌డిచి... మంచి నిర్ణయాలు తీసుకొంటే బాగుంటుంద‌ని నా అభిప్రాయం.  నిర్మాత‌లంతా క‌లిసి... చిత్రసీమ గురించి ఏ మంచి నిర్ణయం తీసుకున్నా.. నా సంపూర్ణ మ‌ద్దతు ఉంటుంది’’ అని స్టేట్మెంట్ ఇచ్చారు.

Updated Date - 2022-07-30T02:28:48+05:30 IST