Aryan Rajesh : సినిమాలనుంచి వెబ్ సిరీస్‌కు షిఫ్ట్..

ABN , First Publish Date - 2022-07-29T15:45:57+05:30 IST

తండ్రి స్టార్ డైరెక్టర్ అయినంత మాత్రాన .. కొడుకు స్టార్ హీరో అయిపోడు. తండ్రి రిఫరెన్స్ ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత టాలెంట్ చూపించి, హీరోగా నిలదొక్కుకోవడం ఆ వారసుడి బాధ్యత. దర్శకరత్న దాసరి (Dasari), దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendrarao) తమ కొడుకుల్ని హీరోగా నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.

Aryan Rajesh : సినిమాలనుంచి వెబ్ సిరీస్‌కు షిఫ్ట్..

తండ్రి స్టార్ డైరెక్టర్ అయినంత మాత్రాన .. కొడుకు స్టార్ హీరో అయిపోడు. తండ్రి రిఫరెన్స్ ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత టాలెంట్ చూపించి, హీరోగా నిలదొక్కుకోవడం ఆ వారసుడి బాధ్యత. దర్శకరత్న దాసరి (Dasari), దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendrarao) తమ కొడుకుల్ని హీరోగా నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. అలా ఫెయిలయిన మరో వారసుడు ఆర్యన్ రాజేశ్ (Aryan Rajesh). టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఒకప్పుడు చక్రం తిప్పిన దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ (EVV Satyanarayana) తనయులు అల్లరి నరేశ్ (Allari Naresh), ఆర్యన్ రాజేశ్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ హీరోలుగా తెరకు పరిచయం అయ్యారు. అల్లరి నరేశ్ కామెడీ హీరోగా స్థిరపడిపోయాడు కానీ.. ఆర్యన్ రాజేశ్‌కు మాత్రం కాలం కలిసిరాలేదు. ‘హాయ్’ (Hai) సినిమాతో తండ్రి దర్శకత్వంలో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించినా.. ‘లీలామహల్ సెంటర్ (Leela Mahal Centre), ఎవడిగోల వాడిదే (Evadigola vadide), సొంతం (Sontham)’ లాంటి కొన్ని సినిమాలే హిట్టయ్యాయి.  


తండ్రి చనిపోయిన తర్వాత ఆర్యన్ రాజేశ్ గురించి చాలా మంది దాదాపు మరిచిపోయారు. ఆ తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్ గానైనా సెటిలవ్వాలనుకున్నాడు. అదీ కుదరలేదు. ఇటీవల బోయపాటి (Boyapati) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ramcharan) నటించిన ‘వినయ విధేయ రామ’ (VinayaVidheya Rama) చరణ్ అన్నగా నటించినప్పటికీ.. సినిమా పరాజయం పాలవడంతో ఆర్యన్ రాజేశ్‌ను మళ్ళీ దురదృష్టమే ఎదురైంది. దాంతో ఇప్పుడు ఆర్యన్ రాజేశ్ వెబ్ సిరీస్ కు షిఫ్ట్ అయిపోయాడు. జీ5 కోసం నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన ‘హలో వరల్డ్’ (Hello World) అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు. అప్పుడెప్పుడో ఫేడవుట్ అయిపోయిన సదా కూడా ఇందులో ఓ ముఖ్యపాత్ర చేస్తోంది. 


కంప్లీట్ ఆఫీస్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’. ఇలాంటి వాటిలో మళ్ళీ నటుడిగా ప్రూవ్ చేసుకొనేంత స్కోపుండదు. డిఫరెంట్ స్టోరీస్‌తో తెరకెక్కే వెబ్ సిరీస్ లో అయితే.. డిఫరెంట్ రోల్స్‌కు ఆస్కారముంటుంది. అలాంటివేమైనా ట్రై చేస్తే బెటరని అనుకుంటున్నారు జనం. మరి ఆర్యన్ కు ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-07-29T15:45:57+05:30 IST