ARYAN KHAN : BIRTH DAY వేళ కూడా తప్పని డ్రగ్స్ కేసు కష్టాలు

ABN , First Publish Date - 2021-11-12T21:46:57+05:30 IST

ఆర్యన్ ఖాన్... అక్టోబర్ నెలలో మీడియాలోనూ, సొషల్ మీడియాలోనూ మార్మోగిన పేరు. షారుఖ్ తనయుడి అరెస్ట్, జైలు జీవితం, చివరకు బెయిల్ మంజూరు... ఇవన్నీ జరుగుతుండగా అందరూ జూనియర్ ఖాన్ గురించే చర్చించుకున్నారు. అయితే, దీపావళికి కొద్ది రోజులు ముందుగా ఇల్లు చేరుకున్న ఆర్యన్ గురించి క్రమంగా మీడియా కవరేజ్ తగ్గించింది. కింగ్ ఖాన్ కొడుకు కూడా అస్సలు బయటకు రావటం లేదు. ఇంటికే పరిమితం అవుతున్నాడు. అయితే, ఇప్పటి వరకూ కాంట్రవర్సియల్ స్టార్ కిడ్ రెండు సార్లు మాత్రం బయటకు వచ్చాడు...

ARYAN KHAN : BIRTH DAY వేళ కూడా తప్పని డ్రగ్స్ కేసు కష్టాలు

ఆర్యన్ ఖాన్... అక్టోబర్ నెలలో మీడియాలోనూ, సొషల్ మీడియాలోనూ మార్మోగిన పేరు. షారుఖ్ తనయుడి అరెస్ట్, జైలు జీవితం, చివరకు బెయిల్ మంజూరు... ఇవన్నీ జరుగుతుండగా అందరూ జూనియర్ ఖాన్ గురించే చర్చించుకున్నారు. అయితే, దీపావళికి కొద్ది రోజులు ముందుగా ఇల్లు చేరుకున్న ఆర్యన్ గురించి క్రమంగా మీడియా కవరేజ్ తగ్గించింది. కింగ్ ఖాన్ కొడుకు కూడా అస్సలు బయటకు రావటం లేదు. ఇంటికే పరిమితం అవుతున్నాడు. అయితే, ఇప్పటి వరకూ కాంట్రవర్సియల్ స్టార్ కిడ్ రెండు సార్లు మాత్రం బయటకు వచ్చాడు. ఆ రెండు సార్లు... నార్కోటిక్స్ నియంత్రణ శాఖ కార్యాలయానికి వెళ్లేందుకే ఇంటి నుంచీ కాలు బయటపెట్టాడు!


గత శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ ఆఫీస్‌‌కు వచ్చాడు ఆర్యన్ ఖాన్. బెయిల్ మంజూరు సమయంలో జడ్జ్ విధించిన షరతులో భాగంగా అతను ఈ పని చేశాడు. అయితే, మళ్లీ ఈ ఫ్రైడే కూడా బాద్షా వారసుడు ఎన్సీబీ అధికారుల ముందు హాజరీ వేయించుకున్నాడు. కాకపోతే, నవంబర్ 12వ తేదీ ఆర్యన్‌కి వెరీ వెరీ స్పెషల్! అదే రోజున, 24 ఏళ్ల క్రితం అతను పుట్టాడు!


బర్త్ డే వేళ ఎప్పుడైతే గ్రాండ్‌గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసే ఆర్యన్, ఈసారి అటువంటివేం చేస్తున్నట్టు, సమాచారం లేదు. అక్టోబర్ 2న తాను అటెండ్ అయిన రేవ్ పార్టీ ఎఫెక్టే ఇంకా అతడిపై కొనసాగుతోంది. అందుకే, కొత్త పార్టీ ఆలోచనలు ఏం చేయకుండా... డ్రగ్స్ కేసుకు సంబంధించి... ఆర్యన్ మరోమారు ఎన్సీబీ ఆఫీస్ సందర్శించాడు. ఆఫీసర్స్ వద్ద వీక్లీ అటెండెన్స్ వేయించుకుని వెనుదిరిగాడు. చూడాలి మరి, 24 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ జూనియర్ ఖాన్ కెరీర్ పరంగా నెక్ట్స్ ఏం చేస్తాడో...  

Updated Date - 2021-11-12T21:46:57+05:30 IST