ARYAN KHAN కు తప్పని నిరీక్షణ... బెయిల్ వచ్చింది కానీ...

ABN , First Publish Date - 2021-10-28T23:15:14+05:30 IST

షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. మూడు రోజుల పాటూ బాంబే హైకోర్టులో సాగిన వాదనల తరువాత ఉత్కంఠకు తెరపడింది. ఎన్సీబీ బలమైన వాదనలు వినిపించినప్పటికీ ఆర్యన్ తరుఫు లాయర్లు చేసిన వాదనకే జస్టిస్ సంబ్రే మొగ్గు చూపారు. కాకపోతే...

ARYAN KHAN కు తప్పని నిరీక్షణ... బెయిల్ వచ్చింది కానీ...

షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. మూడు రోజుల పాటూ బాంబే హైకోర్టులో సాగిన వాదనల తరువాత ఉత్కంఠకు తెరపడింది. ఎన్సీబీ బలమైన వాదనలు వినిపించినప్పటికీ ఆర్యన్ తరుఫు లాయర్లు చేసిన వాదనకే జస్టిస్ సంబ్రే మొగ్గు చూపారు. కాకపోతే, ఆర్యన్ ఖాన్‌తో సహా అర్బాజ్ మర్చంట్, మున్‌మున్‌ దమేచా నేటి రాత్రి కూడా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. వారు ఇమీమియేట్‌గా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. న్యాయమూర్తి శుక్రవారం డిటైల్డ్ ఆర్డర్ మధ్యాహ్నం 2.30 గంటలకి కోర్టులో చదివి వినిపించనున్నారు. ఆ తరువాతే ఆర్యన్ సహా ఇతర నిందుతులు అందరు విడుదల అవుతారు... 


ఆర్యన్ ఖాన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావటంతో కోర్టు విధించే కండీషన్స్ ఏంటో శుక్రవారం తెలియనున్నాయి. బాద్షా తనయుడు తన స్వగృహం ‘మన్నత్’లో కాలుమోపటానికి మరో 24 గంటలు పట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ బెయిల్ తీర్పు కోసం షారుఖ్, గౌరీ గత పాతిక రోజులుగా నిద్దుర లేని రాత్రులు గడుపుతూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వారి ఉత్కంఠకి హైకోర్టు తీర్పుతో తెరపడినట్లైంది. అయితే, శుక్రవారం ఏ సమయానికి ఆర్యన్ ఖాన్ ఇళ్లు చేరుకుంటాడో చూడాలి మరి... 

Updated Date - 2021-10-28T23:15:14+05:30 IST