Aryan Khan లైఫ్‌లో అనూహ్య మార్పులు.. బెయిల్ వచ్చిన తర్వాత అతడేం చేస్తున్నాడో చెప్పిన ఫ్యామిలీ ఫ్రెండ్

ABN , First Publish Date - 2021-11-09T23:40:32+05:30 IST

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇప్పుడెలా ఉన్నాడు? జైలు నుంచీ బెయిల్ మీద తిరిగి వచ్చాక అతనేం చేస్తున్నాడు? ఇటువంటి ప్రశ్నలు తలెత్తటం సహజమే. కానీ, బాలీవుడ్ బాద్షా కొడుకు ఆర్థర్ రోడ్ జైలు నుంచీ ఒక్కసారి తన ఇల్లు ‘మన్నత్’లో కాలుమోపాక...

Aryan Khan లైఫ్‌లో అనూహ్య మార్పులు.. బెయిల్ వచ్చిన తర్వాత అతడేం చేస్తున్నాడో చెప్పిన ఫ్యామిలీ ఫ్రెండ్

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇప్పుడెలా ఉన్నాడు? జైలు నుంచీ బెయిల్ మీద తిరిగి వచ్చాక అతనేం చేస్తున్నాడు? ఇటువంటి ప్రశ్నలు తలెత్తటం సహజమే. కానీ, బాలీవుడ్ బాద్షా కొడుకు ఆర్థర్ రోడ్ జైలు నుంచీ ఒక్కసారి తన ఇల్లు ‘మన్నత్’లో కాలుమోపాక... ఇంత వరకూ బయటకి రాలేదు. కేవలం శుక్రవారం నాడు ఎన్సీబీ ఆఫీసులో అధికారుల ముందు హాజరై వెనుదిరిగాడు...


ఎస్ఆర్కే ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ప్రముఖ బాలీవుడ్ న్యూస్ పోర్టల్‌కి చెప్పిన దాని ప్రకారం... 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ చాలా వరకూ తన రూంలోనే ఉండిపోతున్నాడట. చిన్నప్పట్నుంచీ ఆర్యన్ కాస్త నిశ్శబద్ధంగానే ఉండే రకం. జైలుకి వెళ్లి వచ్చాక మరింత కామ్‌గా మారిపోయాడట. మాట్లాడటానికి అస్సలు ఇష్టం పడటం లేదనీ... ఫ్రెండ్స్‌కి కూడా టచ్‌లో లేడని... చెబుతున్నారు. ఆర్యన్ అలా ప్రవర్తించటానికి, అక్టోబర్ నెలలో అతడికి ఎదురైన చేదు అనుభవాలే, కారణం అంటున్నారు సన్నిహితులు. పుట్టినప్పటి నుంచీ ఎలాంటి కష్టం తెలియకుండా పెరిగిన షారుఖ్, గౌరీ తనయుడు ఒక్క రాత్రిలో జైలులోని షాకింగ్ ప్రపంచంలోకి నెట్టివేయబడ్డాడు. దాదాపు పాతిక రోజులు నిర్భందంలో గడిపాడు. అంతదాకా స్వేచ్ఛ తప్ప మరొకటి తెలియని కుర్రాడు పోలీసులు, ఖైదీలు, కోర్టులు, లాయర్ల మధ్య ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ మానసిక ఒత్తిడి అంతా ఇప్పుడు ఆర్యన్ ప్రవర్తన పై ప్రభావం చూపుతోందని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.  


ఎవ్వరితోనూ మాట్లాడకుండా, తన రూంలో... తనలో తానే జీవిస్తున్న ఆర్యన్ ఖాన్ని, ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా డిస్టబ్ చేయటం లేదట. కొన్నాళ్లు అతడ్ని అలా ఏకాంతంగానే ఉండనీయాలని తల్లి గౌరీ ఖాన్ నిర్ణయించిందట...   

Updated Date - 2021-11-09T23:40:32+05:30 IST