Aryan Khan నుంచి అనూహ్య ప్రపోజల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాద్‌షా తనయుడు

ABN , First Publish Date - 2021-12-10T23:32:09+05:30 IST

షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బాంబే హైకోర్టు అనేక షరతులు

Aryan Khan నుంచి అనూహ్య ప్రపోజల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాద్‌షా తనయుడు

షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బాంబే హైకోర్టు అనేక షరతులు విధించి ఈ ఏడాది అక్టోబర్ 28న బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చేందుకు హై కోర్టు విధించిన ఒక షరతు నుంచి తనను మినహాయించాలని అతడు కోరుతున్నాడు. బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యాూరో(ఎన్సీబీ) ఆఫీస్‌కు హాజరయి అతడు సంతకం చేయాల్సి ఉంది. ఆ షరతు నుంచి మినహాయించాలనే అతడు బాంబే హై కోర్టులో పటిషన్ దాఖలు చేశాడు.


ఆర్యన్ ఖాన్ తరఫున ఒక సంస్థ ఈ పిటిషన్ వేసింది. ‘‘ ఎన్సీబీ ఆఫీస్‌కు వచ్చిన ప్రతిసారి అక్కడ భారీ స్థాయిలో మీడియా ఉంటుంది. ఆఫీసు లోపలికి, బయటికి వచ్చేందుకు పోలీసులు కలుగజేసుకోవాల్సి వస్తుంది ’’ అని ఆ పిటిషన్‌లో ఆర్యన్ పేర్కొన్నాడు. అందువల్ల బెయిల్ షరతు నుంచి మినహాయించాలని కోరుతున్నాడు. గతంలో బెయిల్ మంజూరు కాగానే ఆర్యన్ ఖాన్ అనారోగ్యానికి లోనయ్యాడు. దీంతో ఎన్సీబీ ఆఫీస్‌కు హాజరు కాలేకపోయాడు. 


ఆర్యన్ డ్రగ్స్ కేసును తొలుత సమీర్ వాంఖడే అనే అధికారి దర్యాప్తు చేశాడు. అతడిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కేసు నుంచి అతడిని తప్పించారు. ప్రస్తుతం ఆ కేసును సంజయ్ సింగ్ అనే అధికారి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-10T23:32:09+05:30 IST