ఎన్సీబీ ఆఫీసుకు చేతిలో ఓ పుస్తకంతో సహా వచ్చిన Aryan Khan.. ఆ పుస్తకమేంటో తెలిసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..!

ABN , First Publish Date - 2021-11-06T00:33:39+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు. అనంతరం ముంబై హై‌కోర్టు మెట్లెక్కి బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఆర్యన్‌కు 14 షరతులు విధించారు.

ఎన్సీబీ ఆఫీసుకు చేతిలో ఓ పుస్తకంతో సహా వచ్చిన Aryan Khan.. ఆ పుస్తకమేంటో తెలిసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్..!

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు. అనంతరం ముంబై హై‌కోర్టు మెట్లెక్కి బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఆర్యన్‌కు 14 షరతులు విధించారు. ఆ షరతుల్లో భాగంగా ప్రతి శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కార్యాలయానికి అతడు హాజరయి సంతకం చేయాల్సి ఉంది.  అర్థర్ రోడ్డు జైలు నుంచి అక్టోబర్ 30న విడుదలయిన అనంతరం తొలిసారిగా నవంబర్ 5న ఎన్సీబీ కార్యాలయానికి అతడు విచ్చేశాడు. 


ఎన్సీబీ కార్యాలయం లోపలికి వచ్చేటప్పుడు ఆర్యన్ ఖాన్ ఒక పుస్తకం పట్టుకుని రావడం మీడియా కంటపడింది.  ‘‘ద గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ ’’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ పుస్తకాన్ని ఆయన చదువుతున్నాడు. స్టీయిగ్ లార్సెన్ అనే స్వీడిష్ రచయిత ఈ పుస్తకాన్ని రాశారు. ఈ నవలను ఆధారంగా చేసుకుని అదే పేరుతో ఒక చిత్రం కూడా తెరకెక్కింది. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ నటుడైన డేనియల్ క్రెగ్, రూనీ మార కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో అస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. మరో నాలుగు విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది.


ఆర్యన్ జైలు నుంచి విడుదలయిన అనంతరం తన తండ్రికి సినిమాకు సంబంధించిన అనేక విభాగాల్లో సహాయపడుతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. షారూక్ హీరోగా తెరకెక్కుతోన్న ‘‘ పఠాన్ ’’ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల కోసం సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీపికా పదుకోనె, జాన్ అబ్రహాం ఇతర కీలక పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. బెయిల్ షరతుల్లో భాగంగా ఆర్యన్ ఖాన్ తన పాస్‌పోర్టును ప్రత్యేక కోర్టుకు సరెండర్ చేశారు. 

Updated Date - 2021-11-06T00:33:39+05:30 IST