Aryan Khan డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. NCB పైనే రివర్స్ ఆరోపణలు చేస్తున్న షారూఖ్ కొడుకు..!

ABN , First Publish Date - 2021-10-23T20:11:03+05:30 IST

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్ షా తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Aryan Khan డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. NCB పైనే రివర్స్ ఆరోపణలు చేస్తున్న షారూఖ్ కొడుకు..!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్ షా తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముంబై స్పెషల్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు ఆర్యన్ బెయిల్ పిటిషిన్‌ను తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26వ తేదీన హై కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. కాగా, బెయిల్ పిటిషన్‌లో ఎన్‌సీబీ పైనే ఆర్యన్ ఆరోపణలు చేశాడు. తన ఫోన్‌లోని పాత వాట్సాప్ ఛాట్ ఆధారంగా తనను కేసులో ఇరికించాలని ఎన్‌సీబీ ప్రయత్నిస్తోందని ఆర్యన్ పేర్కొన్నాడు. 


`షిప్‌పై దాడి చేసిన సమయంలో నా దగ్గర ఎలాంటి మాదక ద్రవ్యాలూ ఎన్‌సీబీ అధికారులకు దొరకలేదు. అర్భాజ్ మర్చెంట్, అచిత్ కుమార్ మినహా మిగతా నిందితులతో నాకు పరిచయం లేదు. ఎన్‌సీబీ అధికారులు చెబుతున్న వాట్సాప్ ఛాట్‌తో ఈ కేసుకు ఎలాంటి సంబంధమూ లేదు. అది చాలా కాలం క్రితం నాటిది. ఆ ఛాట్‌ను ఈ కేసుతో ముడిపెడుతూ ఎన్‌సీబీ అధికారులు చేస్తున్న దర్యాఫ్తు పూర్తిగా తప్పు. ఇక, సాక్ష్యాలు తారుమారు చేస్తానేమోననే ఉద్దేశంతో నాకు బెయిల్ నిరాకరించడం సరికాద`ని ఆర్యన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నాడు.  

Updated Date - 2021-10-23T20:11:03+05:30 IST