ARYAN KHAN తో పాటూ మరో తొమ్మిది మందికి ఊరట... వారిద్దరు మాత్రం జైల్లోనే...

ABN , First Publish Date - 2021-10-31T03:56:21+05:30 IST

కొన్ని వారాల పాటూ కలకలం రేపిన ఆర్యన్ ఖాన్ కేసు క్రమంగా సద్దుమణుగుతోంది. మున్ముందు విచారణ సంగతి ఎలా ఉండబోతోన్నా... ప్రస్తుతానికైతే అరెస్ట్ అయిన అందరూ మెల్లగా బెయిల్‌పై బయటకొచ్చేస్తున్నారు. తాజాగా ముంబైలోని ఓ స్పెషల్ కోర్టు ఎన్సీబీ అరెస్ట్ చేసిన మరో తొమ్మిది మందికి ఊరటనిచ్చింది...

ARYAN KHAN తో పాటూ మరో తొమ్మిది మందికి ఊరట... వారిద్దరు మాత్రం జైల్లోనే...

కొన్ని వారాల పాటూ కలకలం రేపిన ఆర్యన్ ఖాన్ కేసు క్రమంగా సద్దుమణుగుతోంది. మున్ముందు విచారణ సంగతి ఎలా ఉండబోతోన్నా... ప్రస్తుతానికైతే అరెస్ట్ అయిన అందరూ మెల్లగా బెయిల్‌పై బయటకొచ్చేస్తున్నారు. తాజాగా ముంబైలోని ఓ స్పెషల్ కోర్టు ఎన్సీబీ అరెస్ట్ చేసిన మరో తొమ్మిది మందికి ఊరటనిచ్చింది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్‌కు డ్రగ్స్ సప్లై చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆచిత్ కుమార్‌కి కూడా బెయిల్ లభించింది. అతడితో పాటూ మరికొందరు నిందుతులకి కోర్టు 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇంత మందికి ఊరట లభిస్తున్నా ఆర్యన్ ఖాన్‌తో పాటూ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాన నిందితులు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ దమేచా మాత్రం ఇంకా ఇంటికి చేరలేకపోతున్నారు... 


ఆర్యన్‌తో పాటే అర్బాజ్, మున్‌మున్‌లకు కూడా బాంబే హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. కానీ, శనివారం కూడా వారు విడుదల కాలేదు. మరో రాత్రి నిందుతులు ఇద్దరూ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్బాజ్, మున్‌మున్ తరుఫు లాయర్లు తగిన పత్రాలు అధికారులకి ఇవ్వాల్సి ఉంది. ఆ పని పూర్తవ్వనందున వారింకా రిలీజ్ కాలేదు. మరో వైపు, కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ మాత్రం ఇంటికి చేరుకున్నాడు. రోడ్లపై భారీగా షారుఖ్ ఫ్యాన్స్ గుమికూడి అతడికి స్వాగతం పలుకుతూ మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు! బాజాభజంత్రీలు మోగించి హంగామా చేశారు! ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులు సహా పది మంది వరకూ తమ మొబైల్స్ దొంగిలింపబడ్డాయని తెలపటం.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొసమెరుపు! 

Updated Date - 2021-10-31T03:56:21+05:30 IST