Aakrosham: అరుణ్‌ విజయ్‌ అస్సలు తగ్గట్లే..

ABN , First Publish Date - 2022-09-10T01:47:34+05:30 IST

అరుణ్ విజయ్ (Arun Vijay) నటించిన మరో సినిమా టాలీవుడ్‌లో విడుదల కాబోతోంది. రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, ప్రభాస్ ‘సాహో’ సినిమాలతో అరుణ్ విజయ్ తెలుగు ప్రేక్షకులకు..

Aakrosham: అరుణ్‌ విజయ్‌ అస్సలు తగ్గట్లే..

అరుణ్ విజయ్ (Arun Vijay) నటించిన మరో సినిమా టాలీవుడ్‌లో విడుదల కాబోతోంది. రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, ప్రభాస్ ‘సాహో’ సినిమాలతో అరుణ్ విజయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తమిళ్‌లో నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతూనే ఉంది. రీసెంట్‌గా ఆయన నటించిన ‘ఏనుగు’ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన నటించిన ‘సినం’ (Sinam) చిత్రాన్ని తెలుగులో ‘ఆక్రోశం’ (Aakrosham) పేరుతో విడుదల చేస్తున్నారు. ఆర్‌. విజయ్‌ కుమార్‌ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌‌టైన్‌మెంట్ పతాకంపై జి.యన్. ఆర్ కుమారవేలన్‌ దర్శకత్వంలో ఆర్‌.విజయకుమార్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని.. సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, శ్రీమతి జగన్మోహనిల కొలబ్రేషన్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అరుణ్ విజయ్ సరసన పల్లక్ లల్వాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌, మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి తదితరులు ఇతర పాత్రలలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సతీష్ కుమార్ (CH Satish Kumar) తెలిపారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ ప్రేక్షకులెప్పుడూ ఎమోషనల్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే ఇంతకుముందు మా బ్యానర్‌లో మంచి కమర్షియల్ కంటెంట్‌తో వచ్చిన ‘ఏనుగు’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందింది. నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్‌గా తమిళ ‘సినం’ ట్రైలర్‌ను చూసి ఆశ్చర్య పోయాను. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామనే సంతృప్తి ఖచ్చితంగా పొందుతారని చెప్పగలను. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకువస్తామని అన్నారు. కాగా, ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం సమాకూర్చారు. (Aakrosham Movie)

Updated Date - 2022-09-10T01:47:34+05:30 IST