XXX season 2: బాలీవుడ్ బ్యూటీఫుల్ మహిళ నిర్మాతపై అరెస్ట్ వారెంట్ జారీ.. సైనికుల భార్యలని అలా చూపించినందుకు..

ABN , First Publish Date - 2022-09-29T16:22:08+05:30 IST

బాలీవుడ్‌లోని అతి కొద్దిమంది మహిళ నిర్మాతలలో ఏక్తా కపూర్ (Ekta Kapoor) ఒకరు. సినిమాలతో పాటు వెబ్‌‌సిరీస్‌లు కూడా నిర్మిస్తూ ఉంటుంది..

XXX season 2: బాలీవుడ్ బ్యూటీఫుల్ మహిళ నిర్మాతపై అరెస్ట్ వారెంట్ జారీ.. సైనికుల భార్యలని అలా చూపించినందుకు..

బాలీవుడ్‌లోని అతి కొద్దిమంది మహిళ నిర్మాతలలో ఏక్తా కపూర్ (Ekta Kapoor) ఒకరు. సినిమాలతో పాటు వెబ్‌‌సిరీస్‌లు కూడా నిర్మిస్తూ ఉంటుంది. వాటిని స్ట్రీమింగ్ చేయడానికి ‘ఆల్ట్ బాలాజీ’ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేసింది. ఈ భామ నిర్మించిన తాజా వెబ్‌సిరీస్ ‘XXX’. ఈ సిరీస్ రెండు సీజన్లు విడుదలై మంచి వ్యూస్‌ని సంపాదించుకుంది. అయితే.. తాజా సీజన్‌లోని కొన్ని సీన్లలో సైనికుల కుటుంబాలను అభ్యంతకరంగా చూపించారంటూ.. ఆ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్‌, శోభ కపూర్‌పై బీహార్‌లోని బెగుసరైలో కేసు నమోదైంది.


మాజీ సైనికుడు శంభు కుమార్ 2020లో ఫైల్ చేసిన ఈ కేసుని తాజాగా విచారించిన జడ్జి వికాస్ కుమార్.. ‘XXX’ నిర్మాత ఏక్తా, శోభ మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. నివేదికల ప్రకారం.. శంభు కుమార్ తరపు న్యాయవాది హృషికేష్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ఏక్తా కపూర్ సారథ్యంలోని బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆల్ట్ బాలాజీ’లో ఈ సిరీస్ ప్రసారం అయ్యింది. శోభా కపూర్‌కి కూడా బాలాజీ టెలిఫిల్మ్స్‌తో సంబంధం ఉంది’ చెప్పారు. ‘కోర్టు వారికి (నిర్మాతలకు) సమన్లు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి తమ ముందు హాజరు కావాలని కోరింది. అయితే వారు అభ్యంతరం తర్వాత సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలను తొలగించామని కోర్టుకు తెలియజేశారు. కానీ వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారిపై వారెంట్ జారీ చేశారు’ అని హృషికేష్ తెలిపారు.


ఏక్తా కపూర్ సిరీస్ ‘XXX సీజన్ 2’లోని అడల్ట్ కంటెంట్ చాలా మందిని ఆకర్షించింది. అయితే చాలా మంది దీనిపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నిర్మాతలలో ఒకరైన ఏక్తా ఇలాంటి అడల్ట్ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం దురదృష్టకరం అని విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2022-09-29T16:22:08+05:30 IST