Arjun reddy: విజయ్‌ దేవరకొండకు వరమా, శాపమా?

ABN , First Publish Date - 2022-09-06T00:03:16+05:30 IST

తెలుగు సినిమా పరిశ్రమలో విజయ్‌ దేవరకొండ ఉవ్వెత్తున్న లేచిన కెరటం. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో సక్సెస్‌ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తదుపరి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజయ్‌ను ఆకాశానికి ఎత్తేసింది.

Arjun reddy: విజయ్‌ దేవరకొండకు వరమా, శాపమా?

తెలుగు సినిమా పరిశ్రమలో విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda)ఉవ్వెత్తున్న లేచిన కెరటం. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో సక్సెస్‌ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తదుపరి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజయ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. చిన్న సినిమాగా విడుదలైనా భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్‌తో దర్శకులు, నిర్మాతలకు విజయ్‌ డేట్ల కోసం క్యూ కట్టారు. ఆ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు మంచి పేరు రావడంతో అదే చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది. అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ వల్ల విజయ్‌కు ‘గీత గోవిందం’ అవకాశం వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో విజయ్‌ స్టార్‌గా ఎదిగాడు.   ఆ సినిమాతో విజయ్‌పై ఒత్తిడి పెరిగింది అనొచ్చు. ఆ తర్వాత విజయ్‌నుంచి ప్రతి సినిమాను అర్జున్‌రెడ్డతో పోల్చడం మొదలుపెట్టారు. ఆ సినిమాతో పోలిక ఇప్పటికీ నడుస్తుంది. అది అతనికి ఓ శాపం అనుకోవచ్చు. 


‘గీత గోవిందం’ హిట్‌ తర్వాత విజయ్‌కు నటించిన సినిమా ఏదీ బాక్సాఫీస్‌ దగ్గర నిలబడలేకపోయింది.  కొన్ని చిత్రాలైతే మరీ డిజాస్టర్‌గా నిలిచాయి. వారం కూడా ఆడలేదు. లోపం ఎక్కడ జరిగింది. విజయ్‌ ఎందుకు ఇలాంటి ఫ్లాప్‌ కథల్ని ఎంచుకున్నాడు. అతనికి ఏమైందని ఇండస్ట్రీ అంతా అనుకుంటున్నారు. .అర్జున్‌ రెడి’ విజయంతో అతని గురించి బాలీవుడ్‌లో కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మ్యానియాను కొంచెం ముందుకు తీసుకెళ్లడానికి ప్యాన్‌ ఇండియా మోజులో పడ్డాడు. చాలామంది హీరోలు రిజెక్ట్‌ చేసిన కథ ‘లైగర్‌’ ప్యాన్‌ ఇండియా పరిచయ చిత్రానికి ఎంపిక చేసుకున్నాడు. దానితో హిందీ పరిశ్రమని కూడా మలుపు తిప్పొచ్చనే భ్రమలో పడి పూరీని గుడ్డిగా నమ్మాడు. వందల కథలు విని అందులో ఒక్కటి సెలెక్ట్‌ చేసుకున్నాను అని చెప్పే విజయ్‌ లైగర్‌ కథకి ఎలా అంగీకరించాడనేది సందేహం. విడుదలకి పది రోజుల ముందు హిట్‌ కొడుతున్నాం అన్న భ్రమలోనే ఉన్నాడట విజయ్‌. ఒక్కసారిగా లేచిన కెరటం మళ్ళీ వెనక్కి పోయి సముద్రంలో కలిసి నట్టుగా, విజయ్‌ మళ్ళీ ఎక్కడ తన పేరు సంపాదించాడో అక్కడికే వచ్చాడు. లైగర్‌ ఫ్లాప్‌ అవటంతో తన తదుపరి సినిమా తీయాల్సిన నిర్మాతలు వెనక్కి వెళ్లిపోయారు. సుమారుగా 300 బడ్జెట్‌ పెట్టి విజయతో ఇంకో పాన్‌ ఇండియా సినిమా మొదలు పెట్టాల్సి ఉండగా, ఇప్పుడు ఆ సినిమానే క్యాన్సిల్‌ చేసేశారు. ఇప్పుడు విజయ్‌ ఆశ అంతా ‘ఖుషి’ సినిమా మీదే. ఈ సినిమాలో అయినా విషయం ఉంటే బాగా ఆడుతుంది. అంతేకానీ దాని వెనకాల నటులు పరుగు తీయాల్సిన అవసరం లేదు. పాన్‌ ఇండియా మోజులో పడి, హై బడ్జెట్‌, హిందీ నటులు, మైక్‌ టైసన్‌ లాంటి అంతర్జాతీయ పేరు వున్న వాళ్ళు సినిమాలో వున్న కథ లేకపోతే ఆ సినిమా జీరో. అందులో  నటించిన నటుడు కూడా అంతే. ఇప్పుడు విజయ్‌ ఆలోచన మారాలి. అర్జున్‌ రెడ్డి,  గీత గోవిందం లాంటి హిట్‌ సినిమాలు ఇచ్చిన విజయ్‌ దేవరకొండ నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారు, తాను ఏమి చేస్తున్నాడు అన్న విషయం మీద దృష్టి పెట్టాలి. మంచి తెలుగు సినిమా చేసి హిట్‌ అయితే అదే ఆ నటుడిని అన్ని ప్రాంతాలకుతీసుకెళ్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సూక్తి కదా, ముందు ఇక్కడ కొన్ని హిట్స్‌ ఇవ్వాలి, తరువాత మంచి కథ దొరికితే అక్కడకి వెళ్ళాలి. ఆలోచించుకో విజయ్‌  దేవరకొండ.


– సురేష్‌ కవిరాయని


Updated Date - 2022-09-06T00:03:16+05:30 IST