ఎంతో భయం.. ఎన్నో కన్నీళ్లు.. అప్పుడు మొదలైంది: యంగ్ హీరో సోదరి

ABN , First Publish Date - 2022-03-08T19:42:19+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ నటుల్లో అర్జున్ కపూర్ ఒకరు. ఈ యంగ్ హీరోకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు అన్షులా కపూర్...

ఎంతో భయం.. ఎన్నో కన్నీళ్లు.. అప్పుడు మొదలైంది: యంగ్ హీరో సోదరి

బాలీవుడ్‌లోని పాపులర్ నటుల్లో అర్జున్ కపూర్ ఒకరు. ఈ యంగ్ హీరోకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు అన్షులా కపూర్. ఈమెకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. అయితే ఈ భామ గతంలో చాలా లావుగా ఉండేది. ఎంతో కష్టం మీద లావు తగ్గిన ఈమె కొన్ని రోజుల క్రితం ఓ పార్టీలో అందరి కంటపడింది. దీంతో ఆమె ఫాలోవర్స్‌తోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కత్రినా కైఫ్, సంజయ్ కపూర్, అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ సైతం ఇది ఎలా సాధ్యమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఈ తార తన వెయిట్ లాస్‌ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.


ఇన్‌‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో అన్షులా తనకు తానే ఓ సలహా ఇచ్చుకుంది. ఆ పోస్ట్‌లో.. ‘ఈ రోజు ఆరోగ్యంగా ఉండటం అంటే నాకు నేను అద్దంలో కనిపించే దానికంటే చాలా ఎక్కువ. నేను ఇలా ఆరోగ్యకరంగా మారడానికి ముందు మానసికంగా చాలా బలహీనంగా ఉండేదాన్ని. బరువు తగ్గేందుకు కష్టపడే ముందు నన్ను తీనేస్తున్న విషయాల గురించి తెలుసుకున్నాను. ఇది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా కష్టమైన స్థితి కూడా. థెరపీ తీసుకున్నాను. ఎన్నోసార్లు ఏడ్చాను. అనిశ్చితి, భయం, ఎదురుదెబ్బలు, అసౌకర్యం, అభద్రతా భావం ఇలాంటివి ఎన్నో నన్ను వెంటాడాయి. వాటి గురించి నాకు నేను తెలుసుకున్న తర్వాత అవి తగ్గించుకోవడం స్టార్ట్ చేశా. 


దీనికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. అయినప్పటికీ ఇంకా అదే పనిలో ఉన్నాను. నా విలువ నా శరీర ఆకృతితో ముడిపడి లేదని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. నా లోపాలను గుర్తు చేసుకోవడం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకున్నాను. ఎలా ఉన్నా నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నా. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ నన్ను నేను ప్రేమించుకునే యోగ్యత ఉంది’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.



Updated Date - 2022-03-08T19:42:19+05:30 IST