Ileana కి మళ్ళీ అవకాశాలు తెచ్చిపెట్టే సినిమాలివేనా..?

ABN , First Publish Date - 2022-08-31T18:55:53+05:30 IST

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వెంటనే పూరి జగన్నాథ్ (Puri Jagannath)

Ileana కి మళ్ళీ అవకాశాలు తెచ్చిపెట్టే సినిమాలివేనా..?

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వెంటనే పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా సరికొత్త రికార్డులు నమోదు చేసిన పోకిరి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రభాస్ (Prabhas), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రవితేజ, రానా దగ్గుబాటి, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాలు అందుకుంది.


అయితే, తెలుగులో మంచి సినిమాలు చేస్తున్నప్పుడే బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. దాంతో ఇక్కడ వచ్చిన అవకాశాలు కూడా కాదనుకొని హిందీ ఇండస్ట్రీకి జంప్ చేసింది. కానీ, అక్కడ ఇలియానాకి పెద్దగా కలిసివచ్చింది లేదు. కొన్ని సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మాత్రం నిలవలేకపోయింది. దాంతో గోవా బీచ్‌లలో ఫొటో షూట్స్ చేసుకుంటూ వాటిని తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది. 


అయితే, ఇటీవల కొన్ని సినిమాలు 4K ఫార్మాట్‌లో రిలీజవుతున్నాయి. ఇప్పటికే, పోకిరి సినిమా రీ రిలీజై మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ జల్సా మూవీ కూడా 4Kలో రీ రిలీజ్ కాబోతోంది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించని ఇలియానా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ మూవీస్‌తో మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తోంది. దాంతో ఇలియానాకి అవకాశాలు రావాలంటే ఇదే మంచి సమయం. ఇలాంటి సమయంలో మేకర్స్ కంట్లో పడితే ఇల్లీ బేబీకి ఇక్కడ మళ్ళీ అవకాశాలు వస్తాయనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Updated Date - 2022-08-31T18:55:53+05:30 IST