ఏఆర్ రెహమాన్ కూతురైన ఖతీజా రూపొందించిన యానిమేటేడ్ మ్యూజిక్ వీడియోకు ఇంటర్నేషనల్ అవార్డు

ABN , First Publish Date - 2021-11-12T20:57:20+05:30 IST

మ్యూజిక్ ఇండస్ట్రీలో ధ్రువ తార ఎవరంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు ఏఆర్. రెహమాన్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఇతర అనేక అవార్డులను ఆయన గెలుచుకున్నారు.

ఏఆర్ రెహమాన్ కూతురైన ఖతీజా రూపొందించిన యానిమేటేడ్ మ్యూజిక్ వీడియోకు ఇంటర్నేషనల్ అవార్డు

మ్యూజిక్ ఇండస్ట్రీలో ధ్రువ తార ఎవరంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు ఏఆర్. రెహమాన్. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఇతర అనేక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ‘‘ స్లమ్ డాగ్ మిలయనీర్ ’’ చిత్రంలో జయహో పాటకు అస్కార్ అవార్డును గెలుపొంది దేశ, విదేశాల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఆయన కూతురు కూడా అవార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఏఆర్. రెహమాన్ గర్వపడేలా చేస్తోంది.


ఏఆర్. రెహమాన్ కూతురైన ఖతీజా ‘‘ఫారిష్టన్’’ పేరుతో ఒక మ్యూజిక్ వీడియోను రూపొందించింది. ఈ మ్యూజిక్ వీడియో యానిమేటేడ్ రూపంలో ఉంటుంది. ఇంటర్నేషనల్ సౌండ్ ప్యూచర్ అవార్డ్స్‌లో బెస్ట్ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా ‘‘ఫారిష్టన్’’ ఎంపికైంది. ఈ అవార్డు సాంకేతికంగా ఏఆర్. రెహమాన్‌‌కే చెందుతుంది. ఎందుకంటే ‘‘ఫారిష్టన్’’కు మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతగా ఏఆర్. రెహమానే వ్యవహరించారు. తన కూతురు అవార్డును గెలుచుకోవడంతో  ఏఆర్.రెహమాన్ ట్విట్టర్‌లో తన సంతోషాన్ని వెలిబుచ్చారు.


‘‘ ఫారిష్టన్‌ ’’ మ్యూజిక్ వీడియోకు అవార్డు రావడం ఇది మొదటి సారేమి కాదు. కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్‌లో ఈ మ్యూజిక్ వీడియో అవార్డ్ ఆఫ్ మెరిట్‌ను గెలుచుకుంది. లాస్ ఏంజెలెస్ పిల్మ్ అవార్డ్స్‌లో కూడా స్పెషల్ మెన్షన్ అవార్డును గెలుపొందింది.



Updated Date - 2021-11-12T20:57:20+05:30 IST