16 ఏళ్లకి బంధానికి బ్రేకప్.. అధికారికంగా ప్రకటించిన ఆక్వామెన్ స్టార్

ABN , First Publish Date - 2022-01-13T17:48:53+05:30 IST

డీసీ కామిక్ మూవీ ‘ఆక్వామెన్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జాసన్ మోమెయా...

16 ఏళ్లకి బంధానికి బ్రేకప్.. అధికారికంగా ప్రకటించిన ఆక్వామెన్ స్టార్

డీసీ కామిక్ మూవీ ‘ఆక్వామెన్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు జాసన్ మోమెయా. తాజాగా ఈ నటుడు తన భార్య లిసా బోనట్‌తో విడిపోతున్నట్లు ఆఫిషీయల్‌గా ప్రకటించాడు. ఆమె పదహరేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పినట్లు సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా తెలిపాడు.


ఆ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. ‘ఎన్నో మార్పులు సంభవిస్తున్న ఈ సమయంలో అందరం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. అనేక మార్పుల నుంచి అనుభూతి చెంది.. అభివృద్ధి చెందుతోంది. అందుకే నా కుటుంబం గురించి ఈ వార్తను పంచుకుంటున్నా. నేను, నా భార్య లిసా బోనెట్ విడిపోతున్నాం.


అయినప్పటికీ మా మధ్య ప్రేమ అలాగే కొనసాగుతుంది. 

కాలంతో పాటు అవసరమైన అన్ని మార్గాల్లో అభివృద్ధి చెందుతుంది. మేము విడిపోయినప్పటికీ పిల్లలపై ఇద్దరికి సమాన బాధ్యతని, ప్రేమని కనబరుస్తామ’ని రాసుకొచ్చాడు.


అయితే జాసన్, లిసా 16 ఏళ్ల రిలేషన్ షిప్‌లో ఉన్నప్పటికీ ఐదేళ్ల క్రితం మాత్రమే పెళ్లి చేసుకోగా.. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Updated Date - 2022-01-13T17:48:53+05:30 IST