ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల ధరల కొత్త జీవో ఇదే!

ABN , First Publish Date - 2022-03-08T01:31:07+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీలో ఉన్న సమస్యల పరిష్కార నిమిత్తమై ఇటీవల సీఎం జగన్‌ను ఇండస్ట్రీ తరపు నుండి కొందరు పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. ఆ భేటీ తర్వాత ఏపీలో టాలీవుడ్‌కి ఉన్న సమస్యలపై ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల ధరల కొత్త జీవో ఇదే!

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీలో ఉన్న సమస్యల పరిష్కార నిమిత్తమై ఇటీవల సీఎం జగన్‌ను ఇండస్ట్రీ తరపు నుండి కొందరు పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. ఆ భేటీ తర్వాత ఏపీలో టాలీవుడ్‌కి ఉన్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల విషయమై మరోమారు కమిటీతో చర్చలు జరిపి.. సరికొత్తగా జీవోని విడుదల చేయబోతున్నట్లుగా సినీ పెద్దలు ప్రకటించారు. ఇదంతా జరిగి దాదాపు నెల కావొస్తోంది. మధ్యలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా ఈ జీవో ఇవ్వడం ఆలస్యమైందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీ అంతా ఎప్పుడా.. ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త జీవోని నేడు(సోమవారం) ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.


ఈ జీవోలో ఉన్న సినిమా టికెట్ల ధరల విషయానికి వస్తే..


మున్సిపల్ కార్పొరేషన్‌:

నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40

ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70

స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100

మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.150, రిక్లయినర్ సీట్లు రూ.250


మున్సిపాలిటీ:

నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30

ఏసీ థియేటర్లలో రూ.80, రూ. 60

స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80

మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.125, రిక్లయినర్ సీట్లు రూ.250


నగర/గ్రామ పంచాయతీ:

నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20

ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50

స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70

మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.100, రిక్లయినర్ సీట్లు రూ.250

(ఈ రేట్లకు జీఎస్టీ, మెయింటెనెన్స్, సర్వీస్ ఛార్జెస్(ఆన్‌లైన్ బుకింగ్) అదనం)





Updated Date - 2022-03-08T01:31:07+05:30 IST