Ap exhibitors: ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

ABN , First Publish Date - 2022-06-26T18:55:17+05:30 IST

ఏపీ ప్రభుత్వంతో సినీరంగానికి రోజుకో ముప్పు వచ్చిపడుతోంది. మొన్నటి వరకూ టికెట్‌ రేట్లు అంటూ సమస్యను సాగదీసిన ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సమస్యను మరింత సాగదీస్తుంది. దీనితో ఎగిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అంతా ప్రభుత్వం పరిధిలోనే ఉండాలని ఓ జీవో జారీ చేశారు. దీనికి ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు.

Ap exhibitors: ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

ఏపీ ప్రభుత్వంతో సినీరంగానికి రోజుకో ముప్పు వచ్చిపడుతోంది. మొన్నటి వరకూ టికెట్‌ రేట్లు అంటూ సమస్యను సాగదీసిన ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సమస్యను మరింత సాగదీస్తుంది. దీనితో ఎగిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అంతా ప్రభుత్వం పరిధిలోనే ఉండాలని ఓ జీవో జారీ చేశారు. దీనికి ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు. ‘మెమోరండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌’ ఫామ్‌పై ఎగ్జిబిటర్‌ వ్యవస్థ సంతకం చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఎగ్జిబిటర్లు దీనికి ససేమిరా కుదరదు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారులతో పలు చర్చలు జరిగినా ప్రభుత్వ ధోరణి మాత్రం ఒకేలా ఉంది. అందుకు నిరసనగా ఈస్ట్‌ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు మంగళవారం నుంచి థియేటర్లు మూసి వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈస్ట్‌ గోదావరి ఎగ్జిబిటర్లు అమలాపురంలో సమావేశమయ్యారు. మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిపి థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని తెలిసింది. ఇదిలా ఉండగా దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. ‘మంగళవారం నుంచి థియేటర్లు మూసివేత.. మెగా ఫ్యామిలీ ఉండగా ఏంటి ఈ నిర్ణయం. వారు తలచుకుంటే ఇదేం పెద్ద సమస్య కాదని తెలియదా’’ అన్న పోస్ట్‌ ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది. 


Updated Date - 2022-06-26T18:55:17+05:30 IST