బాగా భయపెడుతోన్న Anya's Tutorial వెబ్ సిరీస్

ABN , First Publish Date - 2022-07-07T17:59:05+05:30 IST

ప్రత్యేకించి తెలుగువారి కోసం ప్రారంభమైన అల్లు అరవింద్ ‘ఆహా’ (Aha) ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఇటీవల తమిళ కంటెంట్ స్ట్రీమింగ్‌ను కూడా ప్రారంభించింది. బిగినింగ్‌లో పలురకాలుగా విమర్శల పాలైన ఈ సంస్థ.. ఆ తర్వాత క్రమేపీ పుంజుకొని.. ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన కంటెంట్‌ను అందిస్తూ.. ఇప్పుడు టాప్ పొజీషన్‌కు చేరుకుంది.

బాగా భయపెడుతోన్న Anya's Tutorial వెబ్ సిరీస్

ప్రత్యేకించి తెలుగువారి కోసం ప్రారంభమైన అల్లు అరవింద్ ‘ఆహా’ (Aha) ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఇటీవల తమిళ కంటెంట్ స్ట్రీమింగ్‌ను కూడా ప్రారంభించింది. బిగినింగ్‌లో పలురకాలుగా విమర్శల పాలైన ఈ సంస్థ.. ఆ తర్వాత క్రమేపీ పుంజుకొని.. ప్రేక్షకుల కోసం ఆసక్తికరమైన కంటెంట్‌ను అందిస్తూ.. ఇప్పుడు టాప్ పొజీషన్‌కు చేరుకుంది. వారానికో కొత్త కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తామని హామీ ఇచ్చిన ‘ఆహా’ .. ఆ మాట మీద నిలబడనప్పటికీ.. ఏదో ఒక కంటెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది. అందులో భాగంగా ఇటీవల విడుదలైన ఆసక్తికరమైన హారర్ వెబ్ సిరీస్ ‘అన్యస్ ట్యుటోరియల్’ (Anya's Tutorial). ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో హారర్ లవర్స్ ఈ వెబ్ సిరీస్ ను ఎలాగైనా చూడాలని ఫిక్సై పోయారు. ఈ మధ్య దెయ్యాలు, భూతాల కాన్సెప్ట్స్‌కు కాలం చెల్లింది. దక్షిణాది వారు ఈ జోనర్ ను ఎప్పుడో కామెడీగా మార్చేశారు. ఈ నేపథ్యంలో ‘అన్యస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జనాన్ని ఎలా కుర్చీలకు కట్టేసింది అనే ఆసక్తి కలగడం సహజం. 


కథలోకి వెళితే.. 

ఇది ఇద్దరు అక్కచెల్లెళ్ళ కథ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. చిన్నప్పుడు తనకు తన సోదరి (రెజీనా) వల్ల ఎదురైన దారుణ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దయ్యాకా ఆమెను వదిలేసి ఒక ఆపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటుంది అన్య (నివేదిత సతీశ్). ఇన్ స్టాలో యువతను ఆకట్టుకొనేలా పలు అంశాల మీద వీడియో ట్యూషన్స్ చెప్పడం ఆమె వృత్తి. ఆ క్రమంలో ఒంటరిగా ఉన్న తన ఫ్లాట్ లో దెయ్యాలున్నాయన్న సంగతి తనతో పాటు తనను ఆన్ లైన్ లో ఫాలో అవుతున్న వారికీ తెలిసిపోతుంది. తర్వాత కొందరు యువతీ యువకులు దారుణంగా హత్య చేయబడతారు. అసలు అన్యతో పాటు ఉన్న ఆత్మలు ఎవరివి? ఎక్కడో దూరంగా ఉన్నవారు ఎలా చనిపోయారు అన్నదే మిగతాకథ. 


‘అన్య ట్యుటోరియల్’ అనే టైటిల్‌తో ఈ వెరైటీ కాన్సెప్ట్ ను తెరకెక్కించింది దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి (Pallavi Gangireddy). ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సస్పె్న్స్‌ను, థ్రిల్‌ను మెయిన్ టెయిన్ చేస్తూ ప్రేక్షకుల్ని భయపెట్టిన తీరు మెప్పి్స్తుంది. మధ్యలో అనవసరమైన ల్యాగ్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాని థీమ్‌గా తీసుకొని దాని ద్వారా పాత్రల మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసి సరికొత్తగా ఆలోచించడం ఈ తరహా కథల్ని ఇష్టపడేవారిని బాగానే అలరిస్తుంది. మొత్తం ఎపిసోడ్స్ కలుపుకుంటే మూడు గంటలకు కాస్త ఎక్కువగా ఉండడం ప్రేక్షకులకు రిలీఫ్ కలిగించే అంశమే. ఇందులో రెజీనా (Regina) కన్నా నివేదితా సతీశ్ (Niveditha Sathish) బాగా హైలైట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్ కు మంచి హారర్ మూడ్ ను క్రియేట్ చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఒకే ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ హారర్ ట్యుటోరియల్‌ను నిస్సందేహంగా ఒక లుక్ వేయవచ్చు.   



Updated Date - 2022-07-07T17:59:05+05:30 IST