ఇంటర్నేషనల్ చెఫ్‌గా అనుష్క ?

ABN , First Publish Date - 2022-04-27T20:12:11+05:30 IST

‘భాగమతి’ చిత్రంతో మంచి సక్సె్స్ అందుకున్న అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాలో అనుష్క మూగ, చెవుడు అమ్మాయిగా అదరగొట్టినప్పటికీ ఆశించిన మేర ఆడలేదు. ప్రస్తుతం అనుష్క ఒకే ఒక సినిమాలో నటిస్తోంది. మహేశ్ దర్శకత్వంలో జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో నవీన్ పోలీశెట్టి హీరోగా నటిస్తున్నాడు.

ఇంటర్నేషనల్ చెఫ్‌గా అనుష్క ?

‘భాగమతి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాలో అనుష్క మూగ, చెవుడు అమ్మాయిగా అదరగొట్టినప్పటికీ ఆశించిన మేర ఆడలేదు. ప్రస్తుతం అనుష్క ఒకే ఒక సినిమాలో నటిస్తోంది. మహేశ్ దర్శకత్వంలో జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో నవీన్ పోలీశెట్టి హీరోగా నటిస్తున్నాడు. తనకన్నా వయసులో పెద్దదైన అనుష్కతో నవీన్ ప్రేమలో పడతాడట. అనుష్క కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. అప్పుడు వీరిద్దరి మధ్య ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ సినిమా హిలేరియస్ టర్న్ తీసుకుంటుందట. ఈ సినిమాకి ‘మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి’ అనే క్యాచీ టైటిల్ ను రిజిస్టర్ చేశారు. ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్ గా కనిపించనుందట. అలాగే.. నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కనుంది. జాతిరత్నాలు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఆ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో ఏకంగా అనుష్క సరసన హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. మరి సినిమాలో వీరిద్దరి మధ్య ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ  ఏ స్థాయిలో పండబోతుందో చూడాలి. 

Updated Date - 2022-04-27T20:12:11+05:30 IST