ఒంటి చెత్తో క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. అనుష్క ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-04-17T18:45:25+05:30 IST

దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న కపుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట ఒకటి. వారిలో విరాట్ క్రికెట్‌తో, అనుష్క సినిమాలతో..

ఒంటి చెత్తో క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. అనుష్క ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న కపుల్స్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట ఒకటి. వారిలో విరాట్ క్రికెట్‌తో, అనుష్క సినిమాలతో మంచి పాపులారిటీ సాధించారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట అనంతరం కూడా ఒకరికి కెరీర్‌కి మరొకరు సపోర్టు చేసుకుంటుంటారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్‌ ఉన్న విషయం తెలిసిందే. అందులో కెప్టెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు‌ జట్టుని విరాట్ విజయపథంలో తీసుకుపోతున్నాడు.


అయితే.. మంచి బ్యాట్స్‌మెన్‌గా ఎంతో మంది మనసులు దోచిన విరాట్ కోహ్లీ అంతకుమించి మంచి ఫీల్డర్. ఈ విషయాన్ని తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి రుజువు చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కొట్టిన బాల్‌ని ఎంతో కష్టమైనప్పటికీ ఒంటి చెత్తో పట్టుకున్నాడు. ఓడిపోతుందేమో అనుకున్న మ్యాచ్ మొత్తాన్ని ఆర్‌సీబీ వైపు తిప్పేశాడు.


అయితే.. ఇక్కడ విరాట్ క్యాచ్ కంటే ఎక్కువ అందరిని ఆకట్టుకున్న విషయం మరొకటి ఉంది. అదే ఆ సమయంలో మ్యాచ్ చూస్తున్న అనుష్క శర్మ ఎక్స్‌ప్రె‌షన్స్. విరాట్ ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్యాచ్‌ని అందుకోవడం చూసి షాకైన అనుష్క సంతోషంతో రెండు చేతులతో తలను పట్టుకుంది. అంతేకాకుండా.. క్యాచ్ అనంతరం విరాట్ తన భార్యవైపు విక్టరీ సింబల్ చూపిస్తూ.. ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఎంతోమంది ఫ్యాన్స్ ఈ జంటపై కామెంట్స్ చేస్తున్నారు.


‘అనుష్క కుటుంబంతో స్టాండ్స్‌లో ఉండడం ఎవరూ ఊహించలేదు. విరాట్ బాల్‌ని పట్టుకున్న తర్వాత భార్యాభర్త ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకోవడం, ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. చివరగా విరాట్ ఇచ్చిన ఆ ఫ్లయింగ్ కిస్ గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే మరొకరు నెటిజన్ సైతం.. ‘అనుష్క స్టాండ్స్‌లో ఉన్నప్పుడు విరాట్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆర్‌సీబీని గెలిపించడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇదే స్వచ్ఛమైన సంతోషం అంటే. క్యాచ్ తర్వాత ఆమె ముఖంలో చిరునవ్వు. విరాట్ ఆమెకిచ్చిన ఫ్లయింగ్ కిస్. అది నిజమైన సర్‌ప్రైజ్ అంటే. ఇది ఎంతో సంతోషకరమైన రోజు’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.





Updated Date - 2022-04-17T18:45:25+05:30 IST