Anushka : ప్రభాస్ సరసన మళ్ళీ కథానాయికగా?

ABN , First Publish Date - 2022-05-03T16:11:48+05:30 IST

పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది. టైమ్‌మెషీన్ కథాంశంతో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుండగా.. మారుతి దర్శకత్వంలోని చిత్రం కూడా అఫీషియల్‌గా అనౌన్స్ కాబోతోంది.

Anushka : ప్రభాస్ సరసన మళ్ళీ కథానాయికగా?

పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది. టైమ్‌మెషీన్ కథాంశంతో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుండగా.. మారుతి దర్శకత్వంలోని చిత్రం కూడా అఫీషియల్‌గా అనౌన్స్ కాబోతోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్ లో శ్రీలీల, మాళవికా మోహనన్ లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మెయిన్ హీరోయిన్ గా అనుష్క నటిస్తున్నట్టు కొత్తగా ఓ వార్త స్ప్రెడ్ అయింది. 


గతంలో ప్రభాస్ సరసన ‘బిల్లా, మిర్చి, బాహుబలి’ లాంటి సినిమాల్లో అనుష్క కథానాయికగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి అనుష్క ప్రభాస్ జోడీగా నటిస్తుండడం విశేషాన్ని సంతరించుకుంది. ఈ ఇద్దరూ నటించిన మూడు సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్స్ కావడంతో ఈ జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. మారుతి సినిమాకు అది మరింత అడ్వాంటేజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే మూడు భారీ సెట్స్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. అందులో ఒక సెట్ లోనే ప్రధాన భాగం షూట్ జరుపుకోనుంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. 

Updated Date - 2022-05-03T16:11:48+05:30 IST