Anurag Kashyap: అలాంటి వాళ్ల వల్లే హిందీ సినిమాలు ఆడట్లేదు.. బాలీవుడ్ మేకర్స్‌పై డైరెక్టర్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-07-28T19:02:00+05:30 IST

బాలీవుడ్‌లోని క్రియేటివ్ డెరెక్టర్స్‌లో అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఒకరు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’, ‘దేవ్ ఢీ’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి..

Anurag Kashyap: అలాంటి వాళ్ల వల్లే హిందీ సినిమాలు ఆడట్లేదు.. బాలీవుడ్ మేకర్స్‌పై డైరెక్టర్ కామెంట్స్

బాలీవుడ్‌లోని క్రియేటివ్ డెరెక్టర్స్‌లో అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఒకరు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’, ‘దేవ్ ఢీ’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి డిఫరెంట్ కథ చిత్రాలతో ఈ డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అంతేకాకుండా మలయాళం, మరాఠీ, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో సినిమాలు నిర్మించి సౌత్ ఇండియాలోనూ మంచి పాపులారిటీ సాధించాడు. అందుకే ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుడు కచ్చితంగా కొత్తదనం ఉంటుందని అనుకుంటాడు. అందుకే అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఆయన సినిమాలు మంచి బజ్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘దో బారా(Dobaara)’. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది.


స్పానిష్ మూవీ ‘మిరేజ్’కి రిమేక్‌గా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏక్తా కపూర్, సునీర్ కపూర్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూవీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ మూవీ మేకర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అనురాగ్ మాట్లాడుతూ.. ‘సంజయ్ లీలా భన్సాలీ, అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ‘గంగూబాయి కతియావాడి’, ‘భూల్ భూలయ్యా 2’ రెండు సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దానికి కారణం  చిత్రనిర్మాతలు తమ నమ్మకాలకు అనుగుణంగా పని చేయడమే.


మన హిందీ సినిమాలు వారి సంస్కృతితో ముడిపడి ఉండవు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్లు హిందీ సినిమాలు తీస్తున్నారు. ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేలా తీసినందుకే ‘గంగూబాయి’, ‘భూల్ భూలయ్యా 2’తో  సక్సెస్‌ని అందుకోగలిగాయి. అలాగే.. దక్షిణాది మేకర్స్ ఎక్కువగా వారి సంస్కృతిని ప్రతిబింబించేలా సినిమాలు తీస్తారు. అందుకే దేశవ్యాప్తంగా మంచి సక్సెస్ అవ్వగలుగుతున్నాయి. ఎప్పుడైతే బాలీవుడ్ (Bollywood) మేకర్స్ తమ రూట్స్‌కి వెళ్లి సినిమాలు తీస్తారో.. అప్పుడు మన సినిమాలు ప్రేక్షకులను మెప్పించగలుగుతాయి’ అని చెప్పుకొచ్చాడు.



Updated Date - 2022-07-28T19:02:00+05:30 IST