Bheemla Nayak హిందీ రీమేక్ దర్శకుడు అతడేనా?

ABN , First Publish Date - 2022-06-25T16:51:32+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘భీమ్లనాయక్’ (Bheemla Nayak). పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గానూ, రానా రిటైర్డ్ హవల్దార్ గానూ నటించిన ఈ సినిమా ఇగో క్లాష్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొంది.

Bheemla Nayak హిందీ రీమేక్ దర్శకుడు అతడేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘భీమ్లనాయక్’ (Bheemla Nayak). పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గానూ, రానా రిటైర్డ్ హవల్దార్ గానూ నటించిన ఈ సినిమా ఇగో క్లాష్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొంది.  మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (Ayyappanum Koshiyum) చిత్రానికిది అఫీయల్ రీమేక్ అని తెలిసిందే. పృధ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), బిజు మీనన్ (Biju Menon) హీరోలుగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ ను స్టార్ హీరో జాన్ అబ్రహం (John Abraham) కైవసం చేసుకన్న సంగతి తెలిసిందే. మరో పాత్రను అర్జున్ కపూర్ (Arjun Kapoor) చేస్తున్నట్టు కూడా ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.  తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ దర్శకుడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


తాజా సమాచారం ప్రకారం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం హిందీ వెర్షన్ కు బాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) దర్శకత్వం వహించబోతున్నాడట. ‘ది గ్యాంగ్స్ ఆఫ్ వసాపూర్, నో స్మోకింగ్, అగ్లీ, బోంబే టాకీస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలాగే.. ఇమైకా నోడిగల్ (Imaika Nodigal) అనే తమిళ చిత్రంలో విలన్ గా కూడా నటించాడు. అలాంటి దర్శకుడు ఈ సినిమా డైరెక్ట్ చేస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. పోలీస్ చిత్రాలకు పెట్టింది పేరైన జాన్ అబ్రహం ఇందులో మరోసారి పోలీస్ పాత్ర చేయబోతుండడం విశేషం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.   

Updated Date - 2022-06-25T16:51:32+05:30 IST