Anupama Parameswaran: క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్..!

ABN , First Publish Date - 2022-09-14T01:47:51+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘అఆ’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ‘కార్తికేయ-2’

Anupama Parameswaran: క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్..!

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘అఆ’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ‘కార్తికేయ-2’ (Karthikeya 2) తో బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. తాజాగా ఓ క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) వరస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. తాజాగా యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamneni)  హాలీవుడ్ మూవీ జాన్ విక్ (John Wick) స్ఫూర్తితో ఓ కథను రాసుకున్నాడట. రవికి దానిని వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు ‘ఈగల్’ (Eagle) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుందని సమాచారం. ఈ సినిమాలోనే అనుపమ పరమేశ్వరన్ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియగా రూపొందనుందని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌లో పోలండ్‌లో ప్రారంభించనున్నారట. రవితేజ ఇప్పటికే ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నాడు. కార్తిక్ చివరగా నిఖిల్ హీరోగా నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ (Surya VS Surya) కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ‘కార్తికేయ-2’ కు ఎడిటర్‌గా పనిచేయడంతో పాటు స్క్రిఫ్ట్‌ వర్క్‌లో కూడా పాలు పంచుకున్నాడు.    


Updated Date - 2022-09-14T01:47:51+05:30 IST