Anupama parameswaran Interview: ఎన్ని భాషల అవకాశాలైనా.. ఓకే

ABN , First Publish Date - 2022-08-15T00:21:18+05:30 IST

‘‘ప్రయోగాలు చేయడమంటే నాకు ఇష్టం. నా దగ్గరకు వచ్చే పాత్రలు సవాల్‌ విసిరేలా ఉండాలి. ఆ తరహా పాత్రలంటేనే ఇష్టం. ఆర్టిస్ట్‌గా ఎన్ని భాషల్లో అవకాశం వస్తే అన్ని భాషల్లోనూ నటించాలనుంది’’ అని మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ అన్నారు.

Anupama parameswaran Interview: ఎన్ని భాషల అవకాశాలైనా.. ఓకే

‘‘ప్రయోగాలు చేయడమంటే నాకు ఇష్టం. నా దగ్గరకు వచ్చే పాత్రలు సవాల్‌ విసిరేలా ఉండాలి. ఆ తరహా పాత్రలంటేనే ఇష్టం. ఆర్టిస్ట్‌గా ఎన్ని భాషల్లో అవకాశం వస్తే అన్ని భాషల్లోనూ నటించాలనుంది’’ అని మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama parameswaran) అన్నారు. నిఖిల్‌ (Nikhil)హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన  ‘కార్తికేయ 2’ (Karthikeya 2)చిత్రంలో అనుపమా కథానాయికగా నటించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలై విజయం సాధించింది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌ ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 


చందు కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌ అయ్యి సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యా. ప్రతి సినిమాకు కథ అనేది చాలా ముఖ్యం. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు. మనుషుల్లో ఉన్న మంచితనాన్ని నేను దైవంగా భావిస్తాను. ఈ సినిమాలో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. అందుకే కార్తికేయ 2 కోసం కొన్ని ప్రాజెక్ట్‌లు వదులుకున్నా. ఇప్పుడు ముగ్ధ పాత్రకు చక్కని స్పందన వస్తుంది.  అందరూ జేమ్స్‌ బాండ్‌ టైప్‌లో ఎంట్రీ ఇచ్చావు అంటున్నారు. కొన్ని చోట్ల హీరోని డామినేట్‌ చేశావంటున్నారు. కానీ అది నిజం కాదు. హీరో పాత్ర బలమైనది. కథకు తగ్గట్లు నా పాత్రను దర్శకుడు అలా మలిచారు. ఈ సినిమా సక్సెస్‌ నాకు డబుల్‌ ఎనర్జీ ఇచ్చింది. సినిమా చూసినవారంతా చాలా బావుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది.


ఎన్ని భాషల అవకాశాలైనా.. ఓకే! 

‘రౌడీ బాయ్స్‌’లో గ్లామర్‌ పాత్ర చేశాను. అది కావాలని చేసింది కాదు. కథ డిమాండ్‌ మేరకు ముద్దు సన్నివేశాలు చేశా. ప్రయోగాలు చేయడమంటే నాకు ఇష్టం. నాకు వచ్చే పాత్రలు సవాల్‌ విసిరేలా ఉండాలి. ఆ తరహా పాత్రలంటేనే నాకు ఇష్టం. ఆర్టిస్ట్‌గా ఎన్ని భాషల్లో అవకాశం వస్తే అన్ని భాషల్లోనూ నటించాలనుంది. దాని స్పాన్‌ పెరుగుతుంది. 


ఆ సంగతి తెలీదు..

ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా. ప్రస్తుతం చేస్తున్న ‘18 పేజెస్‌’ వారం రోజుల షూటింగ్‌ మినహా పూర్తయింది. ‘కార్తికేయ2’కు సీక్వెల్‌ ఉంటే అలందులో నా పాత్ర ఉంటుందో లేదో తెలియదు. ఆ విషయం గురించి ఇప్పటి వరకూ నేను దర్శకనిర్మాతలతో మాట్లాడలేదు. 


ట్రెండ్‌ మారింది...

ఇంతకుముందు టాలీవుడ్‌ అంతా బాలీవుడ్‌ వైపు చూేసవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రాజమౌళి గారు ‘బాహుబలి’, కేజీఎఫ్‌’ చిత్రాలతో అంతా ఇండియన్‌ సినిమాలు అయిపోయాయి. మన పరిశ్రమకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం గర్వకారణమే కదా! 


మహిళలు సమానంగా ముందుకెళ్తున్నారు..

చిన్నతనంలో ఆగస్ట్‌ 15న జాతీయ జెండా పట్టుకుని స్కూటీ వేసుకుని తిరిగేదాన్ని. ఆ రోజుల్ని మరచిపోలేను. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మహిళా సాధికారత సమానంగా ఉందని నమ్ముతున్నా. పదే పదే మహిళలు వెనకబడి ఉన్నారని చెప్పడం వల్ల ఆ భావన కలుగుతుంది. కానీ ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా ముందుకు వెళుతున్నారు. ఎందులోనూ మహిళలు తక్కువ కాదు.

Updated Date - 2022-08-15T00:21:18+05:30 IST