Anupama Parameswaran: ప్లీజ్‌.. నన్ను అర్థం చేసుకోండి!

ABN , First Publish Date - 2022-08-01T21:39:11+05:30 IST

‘ప్లీజ్‌ నన్ను అర్థం చేసుకోండి’ అంటున్నారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌. తాజాగా ఆమె నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోవడానికి కారణం చెప్పారు.

Anupama Parameswaran: ప్లీజ్‌.. నన్ను అర్థం చేసుకోండి!

‘ప్లీజ్‌ నన్ను అర్థం చేసుకోండి’ అంటున్నారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran). తాజాగా ఆమె నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)చిత్రం ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోవడానికి కారణం చెప్పారు. (Anupama Parameswaran clarity)


‘‘ప్రస్తుతం నేను రెండు సినిమాల చిత్రీకరణలతో రాత్రింబవళ్లు కష్టపడుతున్నా. ఇతర నటీనటులతో కాంబినేషన్‌ సీన్స్‌ చిత్రీకరణకు ఎప్పుడో షెడ్యూల్‌ చేశారు. ఇటువైపు ‘కార్తికేయ 2’ ప్రమోషన్స్‌కి కూడా నేను ప్లాన్‌ చేసుకున్నా. కానీ ఆ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడడంతో షెడ్యూల్‌ మొత్తం తారుమారైంది. దాంతో నా షెడ్యూల్‌ కాస్త టైట్‌ అవ్వడం వల్ల ప్రమోషన్స్‌లో ఎక్కువగా కనిపించలేకపోతున్నా. దయ చేసి నా కష్టాన్ని అర్థం చేసుకోండి. సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టిన నిఖిల్‌ నుంచి మా టీమ్‌ అందరికీ ప్రేమతో కృతజ్ఞతలు చెబుతున్నా’’ అని అనుపమా పరమేశ్వరన్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఇది కాకుండా ‘18 పేజెస్‌’, ’బటర్‌ఫ్లై’  చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.  




Updated Date - 2022-08-01T21:39:11+05:30 IST